ఆంధ్రప్రదేశ్‌

అక్రమాలపై నిఘా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 7: ఎన్నికల్లో మద్యం, డబ్బు పంపిణీ వంటి అక్రమాలకు అడ్డుకట్టవేసేందుకు నిఘా యాప్‌ను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. సామాన్యులు సైతం ఎన్నికల్లో జరిగే అక్రమాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేందుకు ఈ యాప్‌ను రూపకల్పన చేసింది. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో నిఘా యాప్‌ను ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి శనివారం ఆవిష్కరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ యాప్ ద్వారా అక్రమాలకు ప్రభుత్వం అడ్డుకట్ట వేయనుంది. మద్యం, డబ్బు పంపిణీ సహా ఎలాంటి అక్రమాలపైనైనా యాప్ ద్వారా ఫిర్యాదు చేసే వీలు కల్పించారు. దీంతో ఇది సామాన్యుడి చేతిలో బ్రహ్మాస్త్రంగా మారనుంది. ఎవరైనా ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునే వీలు కల్పించారు. నిజాయితీతో రాజకీయాలు చేసే వారిని ప్రొత్సహించేందుకు వీలుగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈసీ, పోలీస్ వ్యవస్థ తీసుకుంటున్న చర్యలకు అదనంగా ఈ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఎన్నికల్లో అక్రమాలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు వంటివి తమ దృష్టికి వచ్చినప్పుడు యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.
*చిత్రం...నిఘా యాప్ ఆవిష్కరిస్తున్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి