ఆంధ్రప్రదేశ్‌

‘స్థానిక’ షెడ్యూల్ విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 7: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం శనివారం ప్రకటించింది. మూడు దశల్లో ఈ ఎన్నికలు నిర్వహించనున్నారు. తొలి దశలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, రెండో దశ లో మున్సిపల్ ఎన్నికలు, మూడోదశలో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తారు. పంచాయతీ ఎన్నికలను మాత్రం రెండు విడతలుగా నిర్వహించనున్నారు. ఈ మేరకు షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్.రమేష్ కుమార్ శనివారం ఇక్కడ విడుదల చేశారు. పంచాయతీలకు, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి వేర్వేరుగా షెడ్యూల్‌లో పేర్కొన్న తేదీల్లో నోటిఫికేషన్లు జారీ చేస్తారు. ముందుగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు రెండు విడతలుగా నిర్వహిస్తారని భావించారు. కానీ
ఒక విడతలోనే నిర్వహించేందుకు తాజాగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్‌ను ఎన్నికల సంఘం శనివారం జారీ చేసింది.
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల షెడ్యూల్
మార్చి 9న రిటర్నింగ్ అధికారులు నోటిఫికేషన్ జారీ చేస్తారు. 11వ తేదీ వరకూ నామినేషన్ల స్వీకరణ. 12న నామినేషన్ల పరీశీలన. 13న అప్పీళ్ల స్వీకరణ. 14న అప్పీళ్ల పరిష్కారం. 14న మధ్యాహ్నం 3 గంటల వరకూ నామినేషన్ల ఉపసంహరణకు గడువు. అదే రోజు సాయంత్రం అభ్యర్థుల తుది జాబితా ప్రకటన. 21న ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్. 24న ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన.
మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్
మార్చి 9న ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ. 11న రిటర్నింగ్ అధికారులు నోటిఫికేషన్ జారీ. 13 వరకూ నామినేషన్ల స్వీకరణ. 14న నామినేషన్ల పరీశీలన. 16న మధ్యాహ్నం 3 గంటల వరకూ నామినేషన్ల ఉపసంహరణకు గడువు. అదే రోజు సాయంత్రం అభ్యర్థుల తుది జాబితా ప్రకటన. 23న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్. 27న ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన.
పంచాయతీ ఎన్నికల తొలి విడత షెడ్యూల్
తొలి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్‌ను మార్చి 15న జారీ చేస్తుంది. ఆయా రిటర్నింగ్ అధికారులు 17న ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేస్తారు. 19 వరకూ నామినేషన్ల స్వీకరణ. 20న నామినేషన్ల పరిశీలన. 21న అభ్యంతరాలను స్వీకరిస్తారు. 22న అభ్యంతరాలను పరిష్కరిస్తారు. 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకూ నామినేషన్ల ఉపసంహరణకు గడువు. అదే రోజు సాయంత్రం అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తారు. 27న ఉదయం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ పోలింగ్. అదే రోజు మధ్యాహ్నం 2 తరువాత ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన.
పంచాయతీ రెండో విడత ఎన్నికల షెడ్యూల్
పంచాయతీ ఎన్నికల రెండో విడత షెడ్యూల్‌ను ఎన్నికల కమిషన్ మార్చి 17న ప్రకటిస్తుంది. ఆయా రిటర్నింగ్ అధికారులు 19న నోటిఫికేషన్ జారీ చేస్తారు. 21 వరకూ నామినేషన్ల స్వీకరణ. 22న నామినేషన్ల పరిశీలన. 23న అభ్యంతరాల స్వీకరణ. 24 మధ్యాహ్నం ఒంటి గంటలోపు అభ్యంతరాల పరిష్కారం. 24 మధ్యాహ్నం 3 గంటల వరకూ నామినేషన్ల ఉపసంహరణకు గడువు. అదే రోజు మధ్యాహ్నం 3 తరువాత తుది జాబితా ప్రకటన. 29న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ పోలింగ్. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన.
*చిత్రం...స్థానిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్‌కుమార్