ఆంధ్రప్రదేశ్‌

9 నెలల పాలనలో 9 ఏళ్లు వెనక్కి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మార్చి 5: రాజధానికి రైతులు ఇచ్చిన భూముల్లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామంటూ పేదల మధ్య ప్రభుత్వం విద్వేషాలను పెంచుతోందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరి సమీపంలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో సీపీఐ నేతలు రామకృష్ణ, ముప్పాళ్ల నాగేశ్వరరావు, హరినాథరెడ్డి గురువారం చంద్రబాబుతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై చర్చించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డి 9 నెలల పాలనలో రాష్ట్రాన్ని 9 నెలలు వెనక్కి నెట్టారన్నారు. అన్ని వర్గాల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధికి తూట్లు పొడవటమే కాకుండా భావి తరాల భవిష్యత్తును అంధకారం చేశారని సీపీఐ నేతలు అభిప్రాయపడ్డారు. కూల్చివేతలు, విధ్వంసాలు, రద్దులు, కోతలు, వేధింపులు, బెదిరింపులు, దాడులు, దౌర్జన్యాలు గతంలో ఎన్నడూ లేవన్నారు. అమరావతి రాజధానిని నిర్వీర్యం చేశారని, పోలవరంతోపాటు ఇతర ప్రాజెక్టు పనులన్నీ నిలిపివేశారని, బీసీ , ఎస్‌సి, ఎస్‌టి, మైనార్టీ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, వారు సాగు చేసుకుంటున్న భూములను అసైన్డ్ భూములంటూ స్వాధీనం చేసుకుంటున్నారని ఆరోపించారు. వైసీపీ ఆరాచకాలకు అడ్డుకట్ట వేయాలని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పారు