ఆంధ్రప్రదేశ్‌

ఆరని ఆగ్రహ జ్వాలలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మార్చి 5: ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని అనే నినాదంతో మూడు రాజధానుల ప్రకటనను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలన్న డిమాండ్‌తో రాజధాని ప్రాంత ప్రజలు, రైతులు, రైతుకూలీలు, మహిళలు చేస్తున్న ఉద్యమం గురువారం 79వ రోజుకు చేరింది. రాజధాని ప్రాంత 29 గ్రామాల ప్రజలు ఒకే నినాదం, ఒకే విజ్ఞప్తితో ఒకేతాటిపైకి చేరి చేస్తున్న ఉద్యమానికి రాష్ట్ర నలుమూలల నుండి వివిధ వర్గాల ప్రజలు, రాజకీయ పక్షాల నేతలు, ప్రజా సంఘాల ప్రతినిధులు, వామపక్షాల నుండి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని చేపట్టిన ఆందోళనల్లో భాగంగా ఎర్రబాలెం, తుళ్లూరు, మందడం, కృష్ణాయపాలెం, వెలగపూడి, నిడమర్రు, బేతపూడి, కురగల్లు, ఉద్దండరాయునిపాలెం, పెదపరిమి, తాడికొండ అడ్డరోడ్డు తదితర గ్రామాల్లో రైతులు, మహిళలు చేస్తున్న రిలే, 24 గంటల దీక్షలు, మహాధర్నాలు కొనసాగాయి. ఆయా దీక్షలు, మహాధర్నాల్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని నిరసనలు వ్యక్తం చేశారు. మందడం, ఎర్రబాలెం, కృష్ణాయపాలెం, తుళ్లూరు, వెలగపూడి ప్రాంతాల్లో నిర్వహిస్తున్న దీక్షా శిబిరాల్లో మహిళలు రెండు చేతులకూ పచ్చ, నల్ల రిబ్బన్లు కట్టుకుని సేవ్ అమరావతి, సేవ్ ఆంధ్రపదేశ్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి మూడు రాజధానుల ప్రకటనను ఉపసంహరించుకుని అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించే వరకూ తమ ఉద్యమాన్ని కొనసాగిస్తామని, ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రాజధాని ముఖద్వారం ఉండవల్లిలో మూడు రాజధానులు వద్దు - అమరావతి ముద్దు అనే నినాదంతో చెవిలో పూలు పెట్టుకుని మహిళలు, రైతులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. అమరావతి పరిరక్షణ సమితి జేఏసి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాయపూడిలో రైతులు, మహిళలు అధర్వణ వేదంలోని వైదిక రాష్ట్రీయ యజ్ఞాన్ని నిర్వహించారు. రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించి అమరావతిని రాజధానిగా కొనసాగించాలని ఈ యాజం నిర్వహించినట్లు తెలిపారు. 50 మందికి పైగా రాజధాని తరలింపుపై ఆవేదనతో రైతులు మరణించారని, వారి ఆత్మకు శాంతి కలగాలని రెండు నిముషాలు వౌనం పాటించారు. వెలగపూడి వద్ద రైతులను కమలానంద భారతీస్వామి, జేఏసీ నాయకులు కలిసి సంఘీభావం తెలియజేశారు. మందడంలో మోకాళ్లపై నిలబడి, రెండు చేతులూ కట్టుకుని రైతులు నిరసన దీక్షలు జరిపారు. దెందులూరు నియోజకవర్గం నుండి జనసేన పార్టీ కార్యకర్తలు, జేఏసీ నాయకులు రాజధాని గ్రామాల్లో పర్యటించి రైతులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇన్‌సైడ్ ట్రేడింగ్ జరిగినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకోవాలే తప్ప రాజధానిని మార్చడం సరికాదన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం పోరాడుతున్న రైతులు అభినందనీయులని కొనియాడారు. జనసేన, బీజేపీతో కలిసి పోరాటాలను మరింత ఉద్ధృతం చేస్తామని స్పష్టం చేశారు. తెనాలి రూరల్ మండలం అంగలకుదురు గ్రామానికి చెందిన మహిళలు, రైతులు రాజధాని ప్రాంతంలోని మందడం, వెలగపూడి దీక్షా శిబిరాలను సందర్శించి తమ సంఘీభావాన్ని తెలియజేశారు. కాగా ఈనెల 8వ తేదీన మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత నేతృత్వంలో వందలాది మంది మహిళలు అమరావతి ప్రాంత రైతులను కలిసి తమ సంఘీభావాన్ని ప్రకటించనున్నట్లు జేఏసీ నేతలు ప్రకటించారు. ఈనెల 15వ తేదీన రాజధాని ప్రాంతంలోని పాస్లర్లందరూ సమావేశమై ఆయా ప్రాంతాల్లోని దీక్షా శిబిరాలను సందర్శించి ఉద్యమ కారులకు సంఘీభావం తెలపాలని దళిత జేఏసీ నిర్ణయించింది.
*చిత్రం... చేతులు కట్టుకుని నిరసన తెలుపుతున్న మహిళలు