S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

03/04/2020 - 03:48

విశాఖపట్నం: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు న్యాయం చేసేలా 59.85 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూనే ఎన్నికలు నిర్వహించాలని విశాఖ టీడీపీ డిమాండ్ చేసింది. అవసరమైతే సుప్రీం కోర్టుకు వెళ్లైనా సరే బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు వర్తించేలా చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి, ఎమ్మెల్సీ రామారావు, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ డిమాండ్ చేశారు.

03/04/2020 - 03:48

విజయవాడ(సిటీ): ప్రపంచాన్ని హడలెత్తిసున్న కరోనా వైరస్ హైదరాబాద్‌కు వచ్చిందనే వార్త ఆందళన కలిగిస్తోందని ప్రతిపక్షనేత నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. ఏపీలోకి కూడా కరోనా వైరస్ వచ్చే ప్రమాదం పొంచి ఉందని మంగళవారం ట్విట్టర్‌లో ఆందోళన వ్యక్తం చేశారు. వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజలందరూ పరిశుభ్రత పాటించాలన్నారు.

03/04/2020 - 03:47

గుంటూరు, మార్చి 3: వెనుకబడిన వర్గాల పట్ల రాష్ట్రప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు బాధాకరమని, కపట వైఖరి ప్రదర్శిస్తూ బీసీలను మోసగించే ప్రయత్నం చేస్తోందని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. టీడీపీ వచ్చిన తర్వాతే బీసీలకు విద్యా, ఆర్థిక, రాజకీయపరంగా ప్రాధాన్యత లభించిందన్నారు.

03/04/2020 - 03:46

గుంటూరు, మార్చి 3: అమరావతినే రాష్ట్రానికి ఏకైక రాజధానిగా ప్రకటిస్తూ, మూడు రాజధానుల ప్రకటనను ఉపసంహరించుకునే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని ఈ విషయంలో ఎంతవరకైనా వెళతామని, వెనక్కు తగ్గేది లేదని రాజధాని ప్రాంత 29 గ్రామాల ప్రజలు స్పష్టం చేశారు.

03/04/2020 - 03:44

విజయవాడ(సిటీ), మార్చి 3: పాత కాలం సామెతలో అత్యంత ప్రాచుర్యంలో ఉన్న అంగిట బెల్లం అత్మలో విషం అనే సామెత పూర్తిగా చంద్రబాబు నైజాన్ని తెలుపుతుందని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి విమర్శించారు. బాబు చేసే పనులన్నీ బీసీలను అణగదొక్కేలా అంటాయంటూ మంగళవారం ట్విట్టర్‌లో ఆరోపించారు. పైకి ఎక్కడాలేని ప్రేమ నటిస్తూనే మరో వైపు మాత్రం బీసీలను అణగదొక్కే పనులు చేస్తుంటాడని ఆరోపించారు.

03/04/2020 - 03:43

అమరావతి, మార్చి 3: కరోనా వైరస్ నియంత్రణకు ముందు జాగ్రత్తలు పాటించాలని కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ ఆదేశించారు. మంగళవారం ఢిల్లీ నుంచి వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో వైద్య, ఆరోగ్యశాఖలతో సమన్వయ సమావేశం నిర్వహించాలని సూచించారు.

03/04/2020 - 01:07

అమరావతి: ఉగాది పండు గ రోజున 25 లక్షల మందికి ఇళ్ల స్థలాల పంపిణీతో పేదల కలలు సాకారం కావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ‘స్పందన’పై కలెక్ట ర్లు, ఎస్పీలతో మంగళవారం సచివాల యం నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమం త్రి మాట్లాడుతూ జిల్లాల వారీగా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించాలన్నారు. స్థలాల గుర్తింపు, అభివృద్ధిపై కలెక్టర్లతో చర్చించారు.

03/04/2020 - 00:59

అమరావతి: కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి ముందు జాగ్రత్తలు పాటించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. స్పందనపై సమీక్ష సందర్భంగా మంగళవారం కలెక్టర్లు, ఎస్పీలకు మార్గదర్శకాలు జారీ చేశారు. తెలంగాణలో కరోనా కేసు నమోదైందని రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎలాంటి కేసులు రాలేదన్నారు. గల్ఫ్ దేశాల్లోనే వైరస్ బాగా విజృంభిస్తోందని తెలిపారు. ఈ విషయంలో ప్రజలు ఆందోళన చెందొద్దని కోరారు.

03/04/2020 - 00:58

విజయవాడ: రాష్ట్రంలో బుధవారం నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి విద్యాశాఖ, పోలీసు శా ఖ పకడ్బందీగా ఏర్పాట్లు చేశాయి. ఈ పరీక్షకు 10.65 లక్షల మంది హాజరు కానున్నారు. మొదటి సారిగా ఇన్విజిలేటర్లకూ జంబ్లింగ్‌ను వర్తింపజేశారు. తొలిసారి హాల్ టికెట్లను నేరుగా డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయం కల్పించారు.

03/04/2020 - 00:57

విజయనగరం: రాష్ట్రంలో భూ యజమానుల హక్కుల పరిరక్షణ చట్టాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి రూపొందించారని రెవెన్యూశాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ వెల్లడించారు. మంగళవారం సాయం త్రం కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం అనంత రం తనను కలసిన విలేఖరులతో ఆయన మా ట్లాడుతూ రైతులకు తమ భూమి తమ చేతుల్లోనే ఉందనే మనోధైర్యం కల్పించేందుకు ముఖ్యమంత్రి నూతనంగా భూ యజమానుల హక్కుల పరిరక్షణ చట్టాన్ని రూపొందించారన్నారు.

Pages