ఆంధ్రప్రదేశ్‌

కరోనాపై అప్రమత్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి ముందు జాగ్రత్తలు పాటించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. స్పందనపై సమీక్ష సందర్భంగా మంగళవారం కలెక్టర్లు, ఎస్పీలకు మార్గదర్శకాలు జారీ చేశారు. తెలంగాణలో కరోనా కేసు నమోదైందని రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎలాంటి కేసులు రాలేదన్నారు. గల్ఫ్ దేశాల్లోనే వైరస్ బాగా విజృంభిస్తోందని తెలిపారు. ఈ విషయంలో ప్రజలు ఆందోళన చెందొద్దని కోరారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. జిల్లా ఆసుపత్రుల్లో ఐసోలేషన్ సెంటర్ల ఏర్పాటుపై దృష్టి సారించాలన్నారు. వైద్య సిబ్బందికి శిక్షణ చాలా ముఖ్యమన్నారు. వైద్యాధికారులను కలుపుకుని శిక్షణ కార్యక్రమాలపై కార్యాచరణ రూపొందించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. కరోనాపై ప్రజలను చైతన్యపరచాల్సిన బాధ్యత ఉందన్నారు. వైరస్ ఎలా వ్యాప్తి చెందుతుంది.. ప్రాథమిక నివారణ చర్యలపై ప్రచారం చేయాలన్నారు. ప్రతి గ్రామ సచివాలయంలో ఇందుకు సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేయాలన్నారు. బాడీ, వౌత్ మాస్క్‌లను అందుబాటులో ఉంచాలన్నారు. ఇప్పటి నుంచే ఆర్డర్ ఇవ్వాలని సూచించారు. అప్పటికప్పుడు ఆందోళన చెందే కంటే ముందస్తుగా సన్నద్ధం కావాలని ఉద్ఘాటించారు. వైరస్‌పై వైద్యారోగ్య శాఖ కార్యదర్శి జవహర్‌రెడ్డి కలెక్టర్లకు వివరాలు
అందజేశారు. ఇప్పటి వరకు 64 దేశాల్లోనే వైరస్ వ్యాప్తి చెందిందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎలాంటి కేసులు నమోదు కాలేదని చెప్తూ ఇకపై కలెక్టర్లు అప్రమత్తంగా వ్యవహరించాలని హెచ్చరించారు. కేవలం 5 శాతం కేసుల్లో మాత్రమే ప్రమాదకర పరిస్థితులు ఉన్నట్లు తెలిపారు. వయో వృద్ధులు ఎక్కువగా విషమ పరిస్థితులను ఎదుర్కొంటున్నారని, సార్స్‌ను విజయవంతంగా ఎదుర్కొన్నట్టే కరోనాను నియంత్రించాలని స్పష్టం చేశారు. జిల్లా స్థాయిలో సమన్వయ కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. ఐసోలేషన్ ప్రక్రియ ముఖ్యమైంది కనుక ఈ కేసులను డీల్ చేసేందుకు సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని సూచించారు. రాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లు ఏర్పాటు చేసి కరోనా వైరస్ వ్యాప్తి చెందిన దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై దృష్టి సారించాలన్నారు.