ఆంధ్రప్రదేశ్‌

బీసీల పట్ల ప్రభుత్వానిది కపట వైఖరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మార్చి 3: వెనుకబడిన వర్గాల పట్ల రాష్ట్రప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు బాధాకరమని, కపట వైఖరి ప్రదర్శిస్తూ బీసీలను మోసగించే ప్రయత్నం చేస్తోందని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. టీడీపీ వచ్చిన తర్వాతే బీసీలకు విద్యా, ఆర్థిక, రాజకీయపరంగా ప్రాధాన్యత లభించిందన్నారు. రాజకీయంగా ఎదగకపోతే వారు అనుకున్న లక్ష్యాలను సాధించుకునే పరిస్థితి ఉండదన్న సదుద్దేశంతో తాము స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పించామన్నారు. వెనుకబడిన వర్గాలకు గుర్తింపు తీసుకువచ్చిన మొదటి పార్టీ తెలుగుదేశమేనని స్పష్టంచేశారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేఖర్ల సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ 1994లో తెచ్చిన చట్టం ప్రకారం బీసీలకు ఎంత శాతం రిజర్వేషన్లు ఇవ్వాలనే అధికారం శాసనసభకు ఉంటుందన్నారు.
బీసీ కమిషన్ జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాల్సి ఉంటుందని, వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో 34 శాతం బీసీ రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలు జరిగాయని గుర్తుచేశారు. అనంతరం కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో 66.55 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని జీవో తెచ్చారని, అయితే ఆ జీవో చెల్లదని హైకోర్టు తీర్పు చెప్పిందన్నారు. నాడు అఖిలపక్ష భేటీ తర్వాత సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయాలని నిర్ణయించారని, కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో 2011 జనాభా లెక్కల ఆధారంగానే ఎన్నికలకు వెళ్లారన్నారు. సొంత మనుషులతో బీసీ రిజర్వేషన్ అంశంపై కోర్టులో కేసులు వేయించి, స్థానిక ఎన్నికల్లో జగన్ రాజకీయాలు చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. చేసిన తప్పులను సమర్థించుకుంటూ ఆరోపణలు మాత్రం తమపై చేస్తున్నారన్నారు.
అమరావతిని నాశనం చేయడానికి ప్రత్యేక విమానంలో న్యాయవాది రోహిత్గీని తెచ్చారని, జగన్ కేసుల కోసం ప్రభుత్వ ధనాన్ని దోచిపెట్టారని, బీసీల రిజర్వేషన్లు కాపాడుకోవడానికి ఆ దిశగా ఎందుకు ప్రయత్నించలేదని చంద్రబాబు ప్రశ్నించారు. దీంతో 16 వేల మంది బీసీలు పదవులు కోల్పోతారని, ఇది మీరు చేసిన ద్రోహం కాదా అని నిలదీశారు. బీసీలు ఎక్కువగా ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనమండలిని రద్దు చేశారని, పేదల అసైన్డ్ భూములు వేలాది ఎకరాలను బలవంతంగా లాక్కుంటున్నారని చంద్రబాబు నాయుడు ఆరోపించారు.