S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

03/05/2020 - 01:06

అమరావతి: కరోనా వైరస్ నియంత్రణకు ప్రభుత్వం చేపట్టిన ముందు జాగ్రత్తలపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఆదేశించారు. బుధవారం సచివాలయంలో సీఎస్

03/05/2020 - 06:25

అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా భూగర్భ జలాల పరిరక్షణ కోసం, ప్రాజెక్ట్‌ల నిర్మాణ పనులు, వాటి పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలన జరిపేందుకు ప్రత్యేక యాప్‌ను రూపొందించినట్లు జలవనరులశాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ ప్రకటించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు యాప్‌కు రూపకల్పన జరిగిందన్నారు. బుధవారం సచివాలయంలోని తన చాంబర్‌లో యాప్‌ను ఆవిష్కరించారు.

03/05/2020 - 00:59

అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికలకు నేడో, రేపో నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నెల 9 నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు మంత్రులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సంకేతాలిచ్చారు. ఎన్నికలు, శాసనసభ బడ్జెట్ సమావేశాల నిర్వహణ తదితర అంశాలపై మంత్రులతో సమాలోచనలు జరిపారు. బుధవారం సచివాలయంలో కేబినెట్ భేటీ సందర్భంగా సుదీర్ఘంగా చర్చించారు.

03/05/2020 - 00:58

అమరావతి: ఉగాది సందర్భంగా ఈనెల 25న రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల మందికి ఇళ్ల స్థలాల పంపిణీలో ఉత్కంఠ నెలకొంది. నెలాఖరులోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో పట్టాల పంపిణీ కార్యక్రమంపై అధికార పార్టీ నేతల్లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

03/05/2020 - 00:57

అమరావతి, మార్చి 4: రాష్ట్రంలో జాతీయ పౌరసత్వ నమోదు (ఎన్‌పీఆర్) కార్యక్రమాన్ని నిలుపుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై క్షేత్ర స్థాయిలో మైనారిటీలతో సహా కొన్ని వర్గాల నుంచి అభ్యంతరాలు వస్తున్నందున వారిలో అభద్రతా భావం నెలకొందని ఈ నేపథ్యంలో దీన్ని నిలిపివేయాలనే నిర్ణయానికి వచ్చింది. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వానికి లేఖ పంపాలని నిశ్చయించింది.

03/05/2020 - 06:24

అమరావతి: హైకోర్టు తీర్పు మేరకు పంచాయతీ ఎన్నికల నిర్వహణ అనివార్యమైంది.. ముహూర్తం దగ్గరపడింది.. గ్రామాలకు వెళ్లండి.. ఎన్నికల్లో విజయం సాధించి తిరిగి రావాలి.. లేకపోతే పదవులు వదులుకోవాల్సిందే అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంత్రి వర్గ సహచరులను హెచ్చరించారు. బుధవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం అనంతరం మంత్రులతో ఆంతరంగిక సమావేశం నిర్వహించారు.

03/04/2020 - 05:00

అమరావతి, మార్చి 3: రాష్ట్రంలో వ్యవసాయ, ఉద్యానవన పంటల సాగులో వినూత్న మార్పులు తీసుకురావాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. మంగళవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో హార్టీకల్చర్, సెరీకల్చర్, రైతు భరోసా కేంద్రాలపై ముఖ్యమంత్రి సమీక్షించారు. రాష్ట్రంలో ఉద్యానవన పంటలు, ఉత్పత్తి, ఎగుమతులపై అధికారులు వివరించారు.

03/04/2020 - 04:58

అమరావతి, మార్చి 3: ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి అప్పు చేసైనా ప్రభుత్వం రైతుల బకాయిలు చెల్లిస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి వెల్లడించారు. మంగళవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వ్యవసాయ, ఉద్యానవన, మార్కెటింగ్ శాఖలపై సమీక్షా సమావేశం సందర్భంగా ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ఆరోపణలపై ముఖ్యమంత్రి తీవ్రంగా స్పందించారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రూ.

03/04/2020 - 03:53

అమరావతి, మార్చి 3: కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి, ముఖ్యమంత్రి సలహాదారుగా ఇటీవల నియమితులైన సుభాష్ చంద్ర గార్గ్ మంగళవారం సీఎం జగన్‌ను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ఆయన ముఖ్యమంత్రిని కలుసుకుని పుష్పగుచ్చం అందజేశారు.

*చిత్రం... ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన సుభాష్‌చంద్ర గార్గ్

03/04/2020 - 03:52

విజయవాడ, మార్చి 3: రాజధాని అమరావతి పరిరక్షణ కోసం ఉద్యమం చేస్తున్న మహిళలపై అక్రమ కేసులు పెడుతున్నారని, శాంతియుతంగా మహిళలు చేసే ఆందోళనలకు రక్షణ కల్పించాలని కోరుతూ అమరావతి పరిరక్షణ సమితి మహిళా విభాగం ఆధ్వర్యంలో మంగళవారం రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు ఫిర్యాదు చేశారు. గవర్నర్‌ను కలిసిన వారిలో అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ సుంకర పద్మశ్రీ, గద్దె అనూరాధ, అక్కినేని వనజ, పలువురు సభ్యులు ఉన్నారు.

Pages