ఆంధ్రప్రదేశ్‌

9 నుంచి ఎన్నికల కోడ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికలకు నేడో, రేపో నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నెల 9 నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు మంత్రులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సంకేతాలిచ్చారు. ఎన్నికలు, శాసనసభ బడ్జెట్ సమావేశాల నిర్వహణ తదితర అంశాలపై మంత్రులతో సమాలోచనలు జరిపారు. బుధవారం సచివాలయంలో కేబినెట్ భేటీ సందర్భంగా సుదీర్ఘంగా చర్చించారు. రెండు రోజుల్లో రిజర్వేషన్ల ప్రక్రియను ముగించాలని నిర్ణయించారు. స్థానిక ఎన్నికల నిర్వహణపై ఎన్నికల కమిషన్‌కు మూడు తేదీలను ప్రభుత్వం సూచించినట్లు తెలియవచ్చింది. ఎన్నికలు ఒకే విడత నిర్వహించాలా.. దశల వారీనా అనే విషయాలపై సీఎం జగన్ పలు
సూచనలు చేసినట్లు సమాచారం. ఎన్నికలు ఈ నెల 24వ తేదీతో ముగించి 25 నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించే అంశం పరిశీలనకు వచ్చినట్లు తెలిసింది. 25 నుంచి నాలుగు రోజుల పాటు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలతో మమ అనిపించాలనే యోచనతో ఉన్నట్లు తెలియవచ్చింది. మూడు రాజధానుల అంశంపై సెలక్ట్ కమిటీని ఏర్పాటు చేస్తూ శాసనమండలి నిర్ణయించింది. ఈ అంశాన్ని గవర్నర్ ప్రసంగంలో చేరిస్తే వ్యతిరేకించాలని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ వ్యూహరచన చేస్తోంది. దీనికి చెక్ పెట్టాలనే యోచనతో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు కసరత్తు జరుపుతున్నట్లు తెలియవచ్చింది. ప్రస్తుతానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు నిర్వహించి జూన్‌లో పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అంశాన్ని పరిశీలిస్తోంది. వీటిపై మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగినట్లు తెలిసింది. ముందు స్థానిక ఎన్నికలపై దృష్టి కేంద్రీకరించి పూర్తి స్థాయి మెజారిటీ సాధించిన తరువాత బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలని భావిస్తోంది. దీనికి తోడు రాష్ట్రంలో టెన్త్, ఇంటర్ పరీక్షలు జరుగుతున్నందున స్థానిక ఎన్నికలు, పరీక్షలకు ఇబ్బంది లేకుండా ఉండేందుకే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు సమాచారం.