ఆంధ్రప్రదేశ్‌

తేడా వస్తే పదవులుండవ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: హైకోర్టు తీర్పు మేరకు పంచాయతీ ఎన్నికల నిర్వహణ అనివార్యమైంది.. ముహూర్తం దగ్గరపడింది.. గ్రామాలకు వెళ్లండి.. ఎన్నికల్లో విజయం సాధించి తిరిగి రావాలి.. లేకపోతే పదవులు వదులుకోవాల్సిందే అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంత్రి వర్గ సహచరులను హెచ్చరించారు. బుధవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం అనంతరం మంత్రులతో ఆంతరంగిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. అధికారంలోకి వచ్చి 9 నెలలే అయింది.. సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం నవరత్నాల్లో భాగంగా అన్నింటినీ ఇప్పటికే నెరవేర్చాం.. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు బలంగా ప్రజల్లోకి వెళ్లాలి.. ఏ మాత్రం అలసత్వం వహించినా వ్యతిరేక ఫలితాలు చవి చూడాల్సి వస్తుంది.. ప్రతిపక్ష ఆరోపణలను తిప్పికొడుతూ గ్రామాల్లో మకాంవేసి గ్రూపులను సమన్వయ పరచాలని ఆదేశించారు. స్థానికంగా దీటైన అభ్యర్థిని బరిలో నిలపాలని ఈ విషయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు సమన్వయంతో వ్యవహరించాలని స్పష్టం
చేశారు. ఈనెల 9 నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి రావచ్చు. ఈ లోగా నియోజకవర్గాల వారీగా జిల్లాల ఇన్‌చార్జి, స్థానిక మంత్రులు సమన్వయ సమావేశాలు నిర్వహించి అందరి అభీష్టం మేరకు అభ్యర్థిని ఎంపిక చేయాలని సూచించినట్లు తెలియవచ్చింది. ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రలోభాలను నియంత్రించే విషయంలో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని సంకేతాలిచ్చారు. జిల్లాల్లో పార్టీ నాయకత్వం మధ్య ఉన్న గ్రూపు తగాదాలను పరిష్కరించి చక్కదిద్దే బాధ్యతను మంత్రులకు అప్పగించారు. ఫలితాల విషయంలో ఎక్కడైనా తేడా వస్తే సంబంధిత ఇన్‌చార్జి, జిల్లా మంత్రులు స్వచ్ఛందంగా రాజీనామాను గవర్నర్‌కు సమర్పించాల్సిందే అని హుకుం జారీ చేసినట్లు సమాచారం. అదే విధంగా ఏయే నియోజకవర్గాల్లో వ్యతిరేక ఫలితాలు వచ్చాయో సంబంధిత ఎమ్మెల్యేలకు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో సీటు ఉండదని తేల్చి చెప్పారు. ఇప్పటి వరకు మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై నిర్వహించిన సర్వే రిపోర్టులు నాకు అందాయి.. మీ జాతకాలన్నీ ఉన్నాయి.. ఇప్పటికైనా కొందరు మంత్రులు తమ పనితీరు మార్చుకోవాలని ఉద్బోధించారు. మంత్రుల సొంత నియోజకవర్గాల్లో ఓటమి పాలైతే ఐదు నిమిషాలు కూడా వ్యవధి ఉండదని నేరుగా తానే గవర్నర్ కార్యాలయం వద్దకు కారులో తీసుకువెళ్లి రాజీనామా చేయిస్తానని హెచ్చరికలు జారీ చేసినట్లు వినికిడి. ఇన్‌చార్జి, జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకుని గెలుపు గుర్రాలను రంగంలో దించాలని స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికలకు ఆయా జిల్లాల ఇన్‌చార్జి మంత్రులు, మంత్రులు బాధ్యత వహించాలని తేల్చి చెప్పారు. సర్వేల్లో ప్రభుత్వ పనితీరుపై అధిక శాతం ప్రజలు సంతృప్తితో ఉన్నట్లు తేలిందని, ఈ పరిస్థితులను ఎన్నికలకు అనుకూలంగా మలచుకుని కార్యకర్తలతో తరచు సమావేశాలు నిర్వహించాలని ఆదేశించినట్లు సమాచారం.

*చిత్రం...మంత్రి వర్గ సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి