ఆంధ్రప్రదేశ్‌

ఇళ్ల పట్టాలపై ఉత్కంఠ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: ఉగాది సందర్భంగా ఈనెల 25న రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల మందికి ఇళ్ల స్థలాల పంపిణీలో ఉత్కంఠ నెలకొంది. నెలాఖరులోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో పట్టాల పంపిణీ కార్యక్రమంపై అధికార పార్టీ నేతల్లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 9 నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్వయాన మంత్రులకు సూచించిన నేపథ్యంలో ఇళ్ల స్థలాల పంపిణీపై
సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించాలనుకున్న ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల ఢిల్లీ పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఆహ్వానించారు. అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఎన్నికలు ముంచుకు రావటంతో ఇళ్ల పట్టాల పంపిణీ సందేహంగా మారింది. అయితే కోడ్ అమల్లో ఉన్నప్పటికీ ముందుగానే ప్రభుత్వం ప్రకటించినందున ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని మంత్రులు స్పష్టం చేస్తున్నారు. కోడ్ అమల్లో ఉన్నందున పంపిణీ చేయరాదని టీడీపీ కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే పేదలకు ఇచ్చే ఇళ్ల పట్టాలను అడ్డుకుందనే అపవాదు మోపేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలియవచ్చింది. గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కోడ్ అమల్లో ఉన్నప్పటికీ చివరి క్షణం వరకు తెలుగుదేశం పార్టీ పసుపు- కుంకుమ కార్యక్రమం కింద నగదు పంపిణీ చేసిందని మంత్రులు గుర్తు చేస్తున్నారు. ఇప్పటికే ప్లాట్లకు మార్కింగ్ జరిగి, జిల్లాల్లో లబ్ధిదారుల జాబితాను గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించారని లాటరీ కూడా నిర్వహిస్తున్నందున ఎలాంటి అభ్యంతరాలు ఉండబోవని రాష్ట్ర సమాచారశాఖ మంత్రి పేర్ని నాని భరోసా ఇచ్చారు. ప్లాట్ల పంపిణీకి కోడ్‌కు సంబంధం ఉండదని తేల్చి చెప్పారు. కోర్టులో పిటిషన్ దాఖలు చేసినా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.