ఆంధ్రప్రదేశ్‌

రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం: రాష్ట్రంలో భూ యజమానుల హక్కుల పరిరక్షణ చట్టాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి రూపొందించారని రెవెన్యూశాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ వెల్లడించారు. మంగళవారం సాయం త్రం కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం అనంత రం తనను కలసిన విలేఖరులతో ఆయన మా ట్లాడుతూ రైతులకు తమ భూమి తమ చేతుల్లోనే ఉందనే మనోధైర్యం కల్పించేందుకు ముఖ్యమంత్రి నూతనంగా భూ యజమానుల హక్కుల పరిరక్షణ చట్టాన్ని రూపొందించారన్నారు. దీని ప్రకారం రైతుల భూమిని ఎవరైనా తప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తే ఆ నష్ట పరిహారాన్ని ప్రభుత్వం రైతులకు అందజేయాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఆ విధం గా రాష్ట్రంలో 3.38 కోట్ల ఎకరాలకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అలాంటి హామీ ఇచ్చారంటే చిన్న విషయం కాదని అన్నారు. ఇదిలా ఉండగా రెవెన్యూ
రికార్డుల ప్యూరిఫికేషన్ గడువును మే నుంచి జూన్ 30 వరకు పొడిగించామన్నారు. ఇందుకు రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన, రీ సర్వే పూర్తి కావాలన్నారు. పైలట్ ప్రాజెక్టు కింద కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో రీ సర్వే ప్రారంభించారని, మరో నెల రోజుల్లో అక్కడ రీ సర్వే పూర్తవుతుందన్నారు. ఆ తరువాత దానిని రాష్టవ్య్రాప్తంగా ఒకే దఫా చేపడతామని ఆయన వివరించారు.
తప్పులకు మండల వ్యవస్థ కారణం
రాష్ట్రంలో మండల వ్యవస్థ ప్రవేశ పెట్టడానికి పూర్వం మున్సబు, కరణం వ్యవస్థ ఉన్నప్పుడు రెవెన్యూ రికార్డులు సక్రమంగా ఉండేవని, ఆ తరువాత దివంగత ఎన్టీ రామారావు అధికారంలోకి వచ్చిన తరువాత ప్రత్యమ్నాయం చూపకుండా మున్సబ్ వ్యవస్థను రద్దు చేసి మండల వ్యవస్థను ప్రవేశపెట్టారని మంత్రి సుభాష్ చంద్రబోస్ అన్నారు. ఆ తరువాత రెండేళ్ల వరకు వీఆర్వోల నియామకం జరగకపోవడం వల్ల రెవెన్యూ రికార్డులు అప్పటి నుంచి తప్పుల తడకగా ఉన్నాయన్నారు. ఈ రికార్డులను ప్రక్షాళన చేసేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి నడుం బిగించారన్నారు.
రూ.45 వేల కోట్ల అప్పులు
రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా గతంలో రూ.4 నుంచి 5 కోట్ల మేరకు అప్పులు ఉండేవని, గత ప్రభుత్వం రూ.45 వేల కోట్ల అప్పులు తమ నెత్తిన పెట్టిందని మంత్రి సుభాష్ చంద్రబోస్ విమర్శించారు. మరోపక్క విభజన సమయంలో మన రాష్ట్రానికి అప్పు రూ.92వేల కోట్లు కాగా, దానిని రూ.3 లక్షల కోట్లకు పెంచిన ఘనత చంద్రబాబు నాయుడుదేనని దుయ్యబట్టారు. వీటన్నింటికీ వడ్డీలు కట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వివరించారు.
ఇదో ప్రపంచ రికార్డు
మాజీ ప్రధాని, దివంగత ఇందిరాగాంధీ హయాంలో 1970లో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైందని గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాథరాజు తెలిపారు. ఇప్పటికీ 50 ఏళ్లు పూర్తయినప్పటికీ దేశంలో 20 లక్షలకు మించి పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన దాఖలాలు లేవన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి హయాంలో ఉగాది నాటికి ఒకే దఫా 25 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు అందజేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. ఇదో ప్రపంచ రికార్డుగా పేర్కొనవచ్చన్నారు. ఇదిలా ఉండగా గత ప్రభుత్వ హయాంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి చెల్లించాల్సిన బిల్లులను కూడా త్వరలో మంజూరు చేస్తామని తెలిపారు. ఎమ్మెల్యేలు కోలగట్ల వీరభద్రస్వామి, అప్పలనర్సయ్య, అలజంగి జోగారావు, కడుబండి శ్రీనివాసరావు, బడ్డుకొండ అప్పలనాయుడు, తదితరులు పాల్గొన్నారు.

*చిత్రం... సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, పక్కన మంత్రి రంగనాథరాజు