ఆంధ్రప్రదేశ్‌

బీసీ రిజర్వేషన్లలోనూ రివర్స్ టెండరింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), మార్చి 5: అధికారంలోకి వచ్చిన నాటి నుండి పూర్తి రివర్స్‌లో పాలన చేస్తున్న సీఎం జగన్ ఆఖరికి బీసీ రిజర్వేషన్లలోనూ అదే పంథాను కొనసాగిస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ విమర్శించారు. బీసీ రిజర్వేషన్ల అంశంలోనూ రివర్స్ టెండరింగ్‌కు వెళ్లిన ఒకే ఒక్క నేత జగన్ మాత్రమేనంటూ గురువారం ట్విట్టర్‌లో లోకేష్ ఎద్దేవా చేశారు. 34 శాతం ఉన్న బీసీ రిజర్వేషన్లను రివర్స్ టెండరింగ్ ద్వారా 24 శాతానికి తగ్గించారన్నారు. బీసీల రిజర్వేషన్లు తగ్గించడం ద్వారా మరోసారి వైఎస్ కుటుంబం బీసీలకు వ్యతిరేకం అని రుజువు చేసుకున్నారని ఆరోపించారు. వైసీపీ ఎన్ని కుట్రలు చేసినా బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సాధించి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. బీసీల రిజర్వేషన్ల అంశంలో ఇప్పటికే సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసినట్లు తెలిపారు. బీసీలను దొంగ దెబ్బతీయాలని చూసిన జగన్‌కు తగిన విధంగా బుద్ది చెబుతామని హెచ్చరించారు.