ఆంధ్రప్రదేశ్‌

శ్రీశైలం డ్యాం రక్షణపై నిపుణుల బృందం సమీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం టౌన్, మార్చి 5: శ్రీశైలం డ్యాం రక్షణకు తీసుకోవాల్సిన చర్యలను పరిశీలించేందుకు తొమ్మిది మంది నిపుణులతో కూడిన బృందం గురువాం శ్రీశైలం చేరుకుంది. వ్యూ పాయింట్ వద్ద ఈ బృందం డ్యామ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా డ్యాం చీఫ్ ఇంజినీర్ మురళీనాథ్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న 170 రిజర్వాయర్ల రక్షణకు అవసరమైన సలహాలు, సూచనలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది మందితో కూడిన నిపుణుల కమిటీని నియమించిందన్నారు. దీంతో కమిటీ సభ్యులు శ్రీశైలం డ్యాం నుంచి పర్యటనను ప్రారంభించినట్లు తెలిపారు. శ్రీశైలం డ్యాంలో మూడు రోజుల పాటు పూర్తిస్ధాయిలో బృందం సభ్యులు డ్యాంపై అధ్యయనం చేసి నివేదికలను ప్రభుత్వానికి సమర్పిస్తారన్నారు. కమిటీ ఛైర్మన్ పాండ్యన్ నేతృత్వంలో సభ్యులు శుక్రవారం నుంచి జలాశయాన్ని పరిశీలిస్తారన్నారు. కమిటీలో సిడబ్ల్యూసీ చీఫ్ ఇంజినీర్ పాండా, రాజగోపాల్, రిటైర్డ్ ఇంజినీర్లు జిఆర్.రావు, కెవి.సుబ్బారావు, సత్యనారాయణ, రామరాజు, డ్యాం ఎన్‌ఈ చంద్రశేఖర్‌రావు ఉన్నారు.
*చిత్రం... అధికారులతో చర్చిస్తున్న నిపుణుల కమిటీ