ఆంధ్రప్రదేశ్‌

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు న్యాయం చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), మార్చి 5: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు తప్పని సరిగా 34 శాతం రిజర్వేషన్లు అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఏపీ గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్‌కు జనసేన పార్టీ నేతలు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో బలహీన వర్గాలను అణగదొక్కాలనే ప్రయత్నం జరుగుతోందని, గవర్నర్ కలుగజేసుకుని న్యాయం చేయాలన్నారు. జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు బీ శ్రీనివాస్ యాదవ్, అధికార ప్రతినిధులు పోతిన మహేష్, అక్కల గాంధీ గురువారం రాజ్‌భవన్‌లో గవర్నర్ హరిచందన్‌ను కలిసి బీసీ రిజర్వేషన్ల అమలు కోసం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 10 శాతం రిజర్వేషన్లు తగ్గించడం ద్వారా 139 కులాల్లో వేలాది మంది బీసీలు రాజకీయ ప్రాతినిధ్యం కోల్పోతారని చెప్పారు. మూడు దశాబ్దాలుగా అమల్లో ఉన్న 34 శాతం బీసీ రిజర్వేషన్లను ఇప్పటి జగన్ ప్రభుత్వం కావాలనే తగ్గించే ప్రయత్నం చేస్తోందన్నారు. బలహీన వర్గాల ప్రాతినిధ్యాన్ని అణగదొక్కాలనే కుట్రతోనే సుప్రీంకోర్టులో కనీసం పిటిషన్ కూడా దాఖలు చేయలేదన్నారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పునరుద్ధరించేలా గవర్నర్ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అప్పటి వరకు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేయాలన్నారు. గవర్నర్‌కు వినతి పత్రం అందించిన జనసేన పార్టీ నేతలు అనంతరం మీడియాతో మాట్లాడుతూ దేశ చరిత్రలో బీసీ ద్రోహిగా జగన్ నిలిచిపోవడం ఖాయమన్నారు. రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్లు పరిరక్షించడానికి జనసేన పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుందన్నారు. బీసీ సంఘాల ద్వారా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు వారు ప్రకటించారు.
*చిత్రం... గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు వినతి పత్రం అందిస్తున్న జనసేన పార్టీ నేతలు