ఆంధ్రప్రదేశ్‌

కళాశాల ఫీజులపై నియంత్రణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మార్చి 9: ఉన్నత విద్యలో ప్రమాణాలు పాటించని కళాశాలలపై కఠిన చర్యలు తప్పవని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హెచ్చరించారు. నాణ్యతా ప్రమాణాలతో విద్యాబోధన తప్పనిసరన్నారు. సోమవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ఉన్నత విద్యపై ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉన్నత విద్య రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ కళాశాలల ఫీజులపై ప్రతిపాదనలను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ముందుంచింది. మంచి చదువులు పిల్లలకు, ప్రభుత్వానికి భారం కారాదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మనం రూపొందించుకునే విధానాలు దీర్ఘకాలం అమలు కావాలని ఆకాంక్షించారు. ఫీజు రీ యింబర్స్‌మెంట్ ఎప్పటికప్పుడు చెల్లింపునకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. గత ఏడాది బకాయిలతో పాటు ఈ ఏడాది త్రైమాసికాలకు సంబంధించి ప్రభుత్వం తరుపున చెల్లించేందుకు అవసరమైన చర్యలు చేపట్టామన్నారు. ఈనెల 30 లోగా ఫీజులు చెల్లించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. దీంతో పాటు ప్రతి విద్యా సంవత్సరంలో త్రైమాసికం పూర్తి కాగానే ఫీజు రీ యింబర్స్‌మెంట్ చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధం గా ఉందన్నారు. ఎప్పటికప్పుడు చెల్లింపుల వల్ల కళాశాలలకు మంచి
జరుగుతుందని ఉద్ఘాటించారు. అందుకే సస్టయినబుల్ ఫీజుల విధానం అమల్లో ఉండాలన్నారు. ప్రమాణాలు పాటించని కళాశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఉన్నత విద్యా వ్యవస్థలో నాణ్యతకు పెద్దపీట వేయాలని అధికారులను ఆదేశించారు. సమీక్షా సమావేశంలో హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య, ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ కే హేమచంద్రారెడ్డి, హయ్యర్ ఎడ్యుకేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సతీష్ చంద్ర తదితరులు పాల్గొన్నారు.

*చిత్రం... ఉన్నత విద్యపై సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి