S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

03/13/2020 - 06:19

విజయవాడ (సిటీ), మార్చి 12: మీ ఇంటికొస్తే ఏమిస్తావు? మా ఇంటికొస్తే ఏమి తెస్తావు?.. అనే రీతిలో సీఎం జగన్ తీరుందని మాజీ మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రజాధనాన్ని స్వార్థ ప్రయోజనాల కోసం వినియోగిస్తున్నారని గురువారం ట్విట్టర్‌లో ఆరోపించారు. రంగులేస్తే 1300 కోట్లు, తీస్తే 1300 కోట్లు, వాట్ యాన్ ఐడియా జగన్‌జీ.. అంటూ విమర్శించారు.

03/13/2020 - 06:18

గుంటూరు, మార్చి 12: రాష్ట్రంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అరాచకాలతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. మంగళగిరి సమీపంలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో గురువారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

03/13/2020 - 06:16

విజయవాడ: రాష్ట్రంలోని మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల (ఎంపీటీసీ)కు భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల ఘట్టం ముగిసే నాటికి 9696 ఎంపీటీసీ స్థానాలకు 50,064 నామినేషన్లు దాఖలయ్యాయి. బుధవారం ఒక్కరోజే అభ్యర్థులు 45,418 నామినేషన్లు దాఖలు చేశారు.

03/13/2020 - 05:26

చీరాల, మార్చి 12: రాజకీయంగా 40 ఏళ్ల అనుభవం ఉన్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, చీరాల శాసనసభ్యుడు కరణం బలరామకృష్ణమూర్తి వైసీపీకి అనుకూలంగా మద్దతు తెలపడంతో ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలో ఒక్కసారిగా అనూహ్యమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి 18వేల ఓట్ల మెజార్టీతో బలరామ్ విజయం సాధించారు.

03/13/2020 - 05:25

నెల్లూరు, మార్చి 12: రాష్ట్రంలోనే తొలి కోవిడ్-19 (కరోనా) కేసు నెల్లూరు నగరంలో నమోదైంది. ఇటీవల ఇటలీ నుండి నెల్లూరుకు వచ్చిన యువకుడికి కరోనా లక్షణాలు కనిపించడంతో జిల్లా ప్రభుత్వాసుపత్రిలోని ప్రత్యేక వార్డులో ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్న విషయం విదితమే. యువకుడి నుండి సేకరించిన నమూనాలను పుణేలోని వైరాలజీ సంస్థకు పంపడంతో అక్కడ్నుంచి కరోనా పాజిటివ్ రిపోర్ట్ వచ్చినట్లు అధికారులు ధ్రువీకరించారు.

03/13/2020 - 00:53

విజయవాడ: రాష్ట్రంలో తొలి కరోనా కేసు గురువారం నమోదైందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో వెల్లడించింది. నెల్లూరు జిల్లాలో ఒక కోవిడ్-19 (కరోనా) కేసు నమోదైందని వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి తెలిపారు. వ్యాధి లక్షణాల నుంచి రోగి కోలుకున్నాడని, 14రోజుల తరువాత మళ్లీ పరీక్షించి డిశ్చార్జ్ చేస్తారన్నారు.

03/13/2020 - 00:51

విజయవాడ (సిటీ), మార్చి 12: నవాంధ్రప్రదేశ్‌పై అప్పుడు తెలుగుదేశం పార్టీ, ఇప్పుడు వైసీపీ విషయం చిమ్ముతున్నాయని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్, భారతీయ జనతా పార్టీ ఏపీ ఇన్‌చార్జ్ సునీల్ దియోథర్, రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు.

03/13/2020 - 00:48

విజయవాడ, మార్చి 12: స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో రాష్ట్రంలో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. టీడీపీ నేతలు తమ గూటిలోకి వచ్చేలా అధికార పార్టీ వైకాపా పావులు కదుపుతోంది. టీడీపీకి పట్టున్న ప్రాంతాల్లోని నేతలు వైకాపాలో చేరేలా మంత్రాంగం నడుపుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీని సంస్థాగతంగా దెబ్బతీయడం ద్వారా మరింతగా పైచేయి సాధించేందుకు వైకాపా అన్ని ప్రయత్నాలూ చేస్తోంది.

03/12/2020 - 06:41

విశాఖపట్నం, మార్చి 11: స్థానిక సంస్థల ఎన్నికల వేళ విశాఖ టీడీపీకి గట్టి షాక్ తగిలింది. పార్టీ వైఖరిని నిరసనగా తాను రాజీనామా చేస్తున్నట్టు రూరల్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు బుధవారం ప్రకటించారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసినట్టు చంద్రబాబుకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఇటీవల కాలం పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలను ఈ సందర్భంగా ఆయన ఏకరవు పెట్టారు.

03/12/2020 - 06:39

అమరావతి, మార్చి 11: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పదవ వసంతంలోకి అడుగిడుతోంది. గురువారం వైసీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ‘మహానేత ఆశయాల స్ఫూర్తితో పుట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పదవ సంవత్సరంలోకి అడుగిడుతోంది..

Pages