ఆంధ్రప్రదేశ్‌

కరోనా కేసు నిర్దారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, మార్చి 12: రాష్ట్రంలోనే తొలి కోవిడ్-19 (కరోనా) కేసు నెల్లూరు నగరంలో నమోదైంది. ఇటీవల ఇటలీ నుండి నెల్లూరుకు వచ్చిన యువకుడికి కరోనా లక్షణాలు కనిపించడంతో జిల్లా ప్రభుత్వాసుపత్రిలోని ప్రత్యేక వార్డులో ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్న విషయం విదితమే. యువకుడి నుండి సేకరించిన నమూనాలను పుణేలోని వైరాలజీ సంస్థకు పంపడంతో అక్కడ్నుంచి కరోనా పాజిటివ్ రిపోర్ట్ వచ్చినట్లు అధికారులు ధ్రువీకరించారు. దీంతో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అనధికారిక హెల్త్ అలర్ట్ కనిపిస్తోంది. అయితే చికిత్స పొందుతున్న యువకుడి ఆరోగ్యం నిలకడగా ఉందని, మరో 14 రోజుల తర్వాత డిశ్చార్చ్ చేస్తామని జిల్లా వైద్యాధికారులు స్పష్టం చేశారు. బాధిత యువకుడి కుటుంబీకులతో పాటు అతను ఎవరెవరిని కలిశాడో వారందరిని కూడా అధికారులు ఐసోలేషన్ వార్డులకు తరలించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. నగరంలో యువకుడు నివసించే చోటుకి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో రెండు రోజుల నుండి అంగన్‌వాడీ, ఆశావర్కర్లు, ఏఎన్‌ఎంలు, వార్డు కార్యదర్శులతో కూడిన బృందం పర్యటిస్తోంది. ఎవరికైనా అనారోగ్య సమస్యలున్నాయేమో తెలుసుకుంటున్నారు. ఇతర దేశాల నుండి ఇటీవల నగరానికి వచ్చిన వారి వివరాలు సేకరిస్తున్నారు. అనుమానితులను చికిత్స నిమిత్తం ఉంచేందుకు నగర శివార్లలో నిర్మించిన ప్రభుత్వ బహుళ అంతస్తుల సముదాయంలో 300 ప్లాట్లను అధికారులు గుర్తించారు. అక్కడ ఐసోలేషన్ వ్యవస్థకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. నగరంలోని ఎక్కడైనా అనుమానిత కేసులు కనిపిస్తే ఇక్కడకు తరలించి చికిత్స చేయనున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు జిల్లాలోని సైదాపురం మండలంలో మరో కరోనా అనుమానిత కేసును వైద్యాధికారులు గుర్తించారు. మండలానికి చెందిన ఒక మహిళ కొద్దిరోజుల కిందట దుబాయ్ నుండి స్వగ్రామానికి వచ్చింది. రెండు రోజుల నుండి జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్న సదరు మహిళను ఆమె ఇంట్లోనే ఉంచి వైద్యాధికారులు చికిత్స చేస్తున్నారు. మహిళ నుండి సేకరించిన నమూనాలను కరోనా పరీక్షల నిమిత్తం పంపామని కలెక్టర్ ఎం.వి.శేషగిరిబాబు స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా పోర్చుగల్ దేశం నుండి ఒక సెమినార్‌లో పాల్గొనేందుకు 30 మంది యువతీ యువకులు ఈనెల 10వ తేది నెల్లూరుకు వచ్చారు. వారు బస చేసిన హోటల్‌లో వారిని ఉంచి వైద్యపరీక్షలు నిర్వహించిన వైద్యాధికారులు కరోనా లక్షణాలు కనిపించడం లేదని తెలపడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. నెల్లూరు కేంద్ర కారాగారంలో ఉండే ఖైదీలు సొంతంగా తయారుచేసిన మాస్కులను ప్రజలకు కూడా ఉచితంగా అందజేయనున్నట్లు కారాగార సూపరింటెండెంట్ రవికిరణ్ తెలిపారు.