ఆంధ్రప్రదేశ్‌

రంగులేస్తే డబ్బులు.. తీస్తే డబ్బులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (సిటీ), మార్చి 12: మీ ఇంటికొస్తే ఏమిస్తావు? మా ఇంటికొస్తే ఏమి తెస్తావు?.. అనే రీతిలో సీఎం జగన్ తీరుందని మాజీ మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రజాధనాన్ని స్వార్థ ప్రయోజనాల కోసం వినియోగిస్తున్నారని గురువారం ట్విట్టర్‌లో ఆరోపించారు. రంగులేస్తే 1300 కోట్లు, తీస్తే 1300 కోట్లు, వాట్ యాన్ ఐడియా జగన్‌జీ.. అంటూ విమర్శించారు. రంగుల కోసం ఖర్చుచేసిన 2600 కోట్లు పెడితే డ్వాక్రా మహిళలకు మీరు మాటిచ్చి తప్పిన రుణాలైనా తీరేవిగా అని కామెంట్ చేశారు. సీఎం జగన్ తుగ్లక్ రివర్స్ పాలనతో రాష్ట్రం తల్లకిందులైందంటూ పలు కార్టూన్‌లను ఆయన ట్విట్టర్‌కు ట్యాగ్ చేశారు.