ఆంధ్రప్రదేశ్‌

ఏపీలో తొలి కరోనా కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: రాష్ట్రంలో తొలి కరోనా కేసు గురువారం నమోదైందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో వెల్లడించింది. నెల్లూరు జిల్లాలో ఒక కోవిడ్-19 (కరోనా) కేసు నమోదైందని వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి తెలిపారు. వ్యాధి లక్షణాల నుంచి రోగి కోలుకున్నాడని, 14రోజుల తరువాత మళ్లీ పరీక్షించి డిశ్చార్జ్ చేస్తారన్నారు. ఈ కేసుకు సంబంధించి మరో ఐదుగురిని కూడా 14రోజుల పాటు ఆసుపత్రిలో ఉంచుతామని తెలిపారు. వారికి ఎలాంటి వ్యాధి లక్షణాలు లేవన్నారు. కరోనా ప్రభావిత దేశాల నుంచి 666 మంది వచ్చారని, వారిలో 561 మందిని పరిశీలనలో ఉంచామని తెలిపారు. 28రోజుల పరిశీలన 233 మంది పూర్తి చేసుకున్నారని వెల్లడించారు. ఇంకా 328 మంది పరిశీలనలో ఉన్నారు. ఆసుపత్రిలో 9మంది, ఇంటిలో పరిశీలనలో 319 మంది ఉన్నారు. 52మంది నుంచి శాంపిళ్లను తీయగా
వాటిలో 47 నెగిటివ్ వచ్చాయని, ఒకటి పాజిటివ్ వచ్చింది. మరో నాలుగు కేసుల ఫలితాలు రావాల్సి ఉంది. అయితే విదేశాల నుంచి వచ్చినవారిలో 105 మంది ఆచూకీ ఇంకా లభించాల్సి ఉందని ఆయన తెలిపారు. విశాఖ విమానాశ్రయంలో 64 అనుమానిత కేసులను గుర్తించామన్నారు. ఇతర దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చేవారిపై నిఘా పెట్టామని, కరోనా ప్రభావిత దేశాల నుంచి వచ్చినవారు తప్పనిసరిగా 28రోజులు పరిశీలనలో ఉండాలని స్పష్టం చేశారు. అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశామని, వదంతులను నమ్మవద్దని కోరారు. కోవిడ్-19 లక్షణాలు ఉంటే సమీపంలోని ఆసుపత్రుల్లో సంప్రదించాలని జవహర్‌రెడ్డి సూచించారు.