ఆంధ్రప్రదేశ్‌

ఎంపీటీసీ స్థానాలకు 50,064 నామినేషన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: రాష్ట్రంలోని మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల (ఎంపీటీసీ)కు భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల ఘట్టం ముగిసే నాటికి 9696 ఎంపీటీసీ స్థానాలకు 50,064 నామినేషన్లు దాఖలయ్యాయి. బుధవారం ఒక్కరోజే అభ్యర్థులు 45,418 నామినేషన్లు దాఖలు చేశారు. శ్రీకాకుళం జిల్లాలో 3336, విజయనగరం జిల్లాలో 2733, విశాఖ జిల్లాలో 3714, తూర్పు గోదావరి జిల్లాలో 5563, పశ్చిమ గోదావరి జిల్లాలో 4598, కృష్ణా జిల్లాలో 3671, గుంటూరు జిల్లాలో 3852, ప్రకాశం జిల్లాలో 4116, నెల్లూరు జిల్లాలో 2832, కర్నూలు జిల్లాలో 4022, అనంతపురం జిల్లాలో 4575, చిత్తూరు జిల్లాలో 4260, కడప జిల్లాలో 2792 నామినేషన్లు దాఖలయ్యాయి.
ఇందులో బీఎస్పీ తరపున 138 మంది, బీజేపీ తరపున 1816, సీపీఐ తరపున 238, సీపీఎం తరపున 410, కాంగ్రెస్ తరపున 395, జనసేన పార్టీ తరపున 2027, టీడీపీ తరపున 18,242, వైకాపా తరపున 23,210 మంది నామినేషన్లు వేశారు. తొలిరోజు 9న 945, 10న 3700 నామినేషన్లు దాఖలయ్యాయి. కానీ మంచి ముహూర్తాల ప్రకారం చివరిరోజు భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు కావడం గమనార్హం.
ఇక రాష్ట్రంలోని 652 జెడ్పీటీసీ స్థానాలకు 4778 నామినేషన్లు దాఖలయ్యాయి. బుధవారం ఒక్కరోజే 4335 మంది నామినేషన్లు వేశారు. శ్రీకాకుళం జిల్లాలో 281, విజయనగరం జిల్లాలో 241, విశాఖ జిల్లాలో 296, తూర్పు గోదావరి జిల్లాలో 482, పశ్చిమ గోదావరి జిల్లాలో 370, కృష్ణా జిల్లాలో 331, గుంటూరు జిల్లాలో 388, ప్రకాశం జిల్లాలో 394, నెల్లూరు జిల్లాలో 330, కర్నూలు జిల్లాలో 351, అనంతపురం జిల్లాలో 474, చిత్తూరు జిల్లాలో 480, కడప జిల్లాలో 341 నామినేషన్లను అభ్యర్థులు దాఖలు చేశారు. బీఎస్పీ తరపున 82, బీజేపీ తరపున 433, సీపీఐ తరపున 40, సీపీఎం తరపున 68, కాంగ్రెస్ తరపున 368, జనసేన పార్టీ తరపున 270, టీడీపీ తరపున 1413, వైకాపా తరపున 1866 మంది నామినేషన్లు వేశారు.