ఆంధ్రప్రదేశ్‌

సయోధ్య సాధ్యమేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చీరాల, మార్చి 12: రాజకీయంగా 40 ఏళ్ల అనుభవం ఉన్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, చీరాల శాసనసభ్యుడు కరణం బలరామకృష్ణమూర్తి వైసీపీకి అనుకూలంగా మద్దతు తెలపడంతో ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలో ఒక్కసారిగా అనూహ్యమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి 18వేల ఓట్ల మెజార్టీతో బలరామ్ విజయం సాధించారు.
అయితే నియోజకవర్గంలో చోటుచేసుకున్న పరిణామాల నేపధ్యంలో నియోజకవర్గాన్ని, ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించాలన్న ఏకైక లక్ష్యంతో వైఎస్సార్‌సిపి అనుబంధ సభ్యుడుగా కొనసాగేందుకు నిర్ణయించుకోవడం, దీంతో పాటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సమక్షంలో అతని తనయుడు కరణం వెంకటేష్, మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావు, టీడీపీ నాయకులు, అభిమానులు పెద్దఎత్తున పార్టీలో చేరారు. దీంతో చీరాలలో వైసీపీ తిరుగులేని పార్టీగా అవతరించిందనటంలో ఏమాత్రం సందేహం లేదు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ సునాయాసంగా గెలిచే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశే్లషకులు చెబుతున్నారు. శాసనమండలి సభ్యురాలు పోతుల సునీత గత రెండు నెలల క్రితం వైఎస్సార్‌సిపికి మద్దతు తెలుపుతూ తన అనుచరులతో ముఖ్యమంత్రిని కలిసింది. అలానే టీడీపీకి చెక్‌పెట్టి వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారు. ప్రస్తుతం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ చుక్కానిలేని నావలా తయారైంది. పార్టీని ఆదుకునే నాయకుడే కనిపించడంలేదు. జిల్లాస్థాయిలో పట్టు ఉన్న నాయకుడుగా గుర్తింపు ఉన్న కరణం బలరామ్ వైసీపీకి అనుకూలంగా మారడంతో జిల్లాలో మరికొంతమంది నాయకులు వైసీపీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉంటుందని అంచనాలు వేస్తున్నారు. చీరాలలో వైఎస్సార్‌సీపీ కార్యదర్శి డాక్టర్ అమృతపాణి, సహాయ కార్యదర్శి శామ్యూల్ మోజస్ తదితరులను కలుపుకుని బలరామ్ వర్గీయులు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో చక్రం తిప్పుతారని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు.
సందిగ్ధంలో ఆమంచి రాజకీయ బద్ధశత్రువులుగా ఉన్న ఎమ్మెల్యే కరణం బలరామ్, మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆమంచి కృష్ణమోహన్ భవిష్యత్‌లో ఏ విధంగా కలిసి ప్రయాణం చేస్తారనేది వెయ్యి డాలర్ల ప్రశ్నగా మారింది. అసలు ఈ ఇద్దరికి పొత్తు పొసగుతుందా అనే ప్రశ్న సగటు వైసీపీ కార్యకర్తను వెంటాడుతోంది. నిన్నటి మొన్నటి వరకు నియోజకవర్గంలో ఏ కార్యక్రమం చేపట్టినా కరణం బలరామ్‌ను వైసీపీ నాయకులు అడ్డుకోవడం పరిపాటిగా మారింది. ప్రస్తుతం వైసీపీకి అనుకూలంగా ఎమ్మెల్యే బలరామ్ మారడం, దీనికి తోడు ఇటీవలకాలంలో ఎమ్మెల్సీ పోతుల సునీత వైకాపాకు అనుబంధంగా మారడంతో బలమైన ముగ్గురు నాయకులు ఏ విధంగా కొనసాగుతారనేది ప్రజలు చర్చించుకుంటున్నారు. వైసీపీకి మాజీ ఎమ్మెల్యే ఆమంచి అండగా ఉంటూ స్థానిక సంస్థల ఎన్నికలలో అభ్యర్థుల విజయంకోసం శక్తివంచన లేకుండా కృషిచేస్తూ టీడీపీ నుంచి వైసీపీలోకి ఇటీవల కాలంలో వందలాది మంది నాయకులు, కార్యకర్తలను పార్టీలోకి ఆహ్వానించి పార్టీ బలోపేతానికి విశేషంగా కృషిచేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా ముందుకు సాగుతున్న తరుణంలో అకస్మాత్తుగా ఈ పరిణామాలు సంభవించడం ఆమంచికి ఒకరకమైన ఇబ్బంది అనే చెప్పాల్సి ఉంటుంది.