ఆంధ్రప్రదేశ్‌

టీడీపీ నేతలపై వైకాపా గురి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 12: స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో రాష్ట్రంలో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. టీడీపీ నేతలు తమ గూటిలోకి వచ్చేలా అధికార పార్టీ వైకాపా పావులు కదుపుతోంది. టీడీపీకి పట్టున్న ప్రాంతాల్లోని నేతలు వైకాపాలో చేరేలా మంత్రాంగం నడుపుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీని సంస్థాగతంగా దెబ్బతీయడం ద్వారా మరింతగా పైచేయి సాధించేందుకు వైకాపా అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. కీలక సమయంలో అనేక మంది టీడీపీ నేతలు వైకాపాలో చేరడం గమనార్హం. తాజాగా టీడీపీ సీనియర్ నేత, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సమక్షంలో గురువారం వైకాపా గూటికి చేరారు. తన కుమారుడు వెంకటేష్ సహా చేరుతున్నట్లు ప్రకటించి తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. సముచిత స్థానం కల్పించినప్పటికీ కరణం పార్టీ మారడం టీడీపీ వర్గాలకు మింగుడు పడటం లేదు. ప్రకాశం జిల్లాలో టీడీపీకి పెద్దదిక్కుగా ఉన్న బలరాంను తమవైపు తిప్పుకోవడం ద్వారా వైకాపా గట్టి దెబ్బతీసింది. గత ఎన్నికల్లో వైకాపా 151 అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్నా, విశాఖ నగరంలోని నాలుగు స్థానాలను మాత్రం టీడీపీ కైవసం చేసుకుంది. దీంతో విశాఖ జిల్లా నేతలను కూడా వైకాపా లక్ష్యంగా చేసుకుని ఆకర్షించే ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులోభాగంగానే మాజీ ఎమ్మెల్యే, టీడీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్‌బాబుతో నడిపిన వ్యవహారాల నేపథ్యంలో ఆయన త్వరలో వైకాపా తీర్థం పుచ్చుకోనున్నారని తెలుస్తోంది. విశాఖ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు ఎస్‌ఏ రహెమాన్, తైనాల విజయకుమార్, పీ బాలరాజు,
చింతలపూడి వెంకట్రామయ్య వంటివారు ఇప్పటికే వైకాపాలో చేరారు. ప్రకాశం జిల్లా కనిగిరి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత కదిరి బాబూరావు కూడా వైకాపాలో చేరారు. పులివెందుల నేత సతీష్‌రెడ్డి, జమ్మలమడుగు నుంచి రామసుబ్బారెడ్డి కూడా వైకాపా కండువా కప్పుకునేలా చేయడంలో అధికార పార్టీ విజయం సాధించింది. టీడీపీని బలహీన పరిచేందుకు మరికొందరు నేతలను ఆకర్షించే పనిలో వైకాపా ఉంది. టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తాజా రాజకీయ పరిణామాలపై వెంటనే దృష్టి సారించి నష్ట నివారణ చర్యలు చేపట్టారు.
ఏకగ్రీవాలపై దృష్టి
ఇదిలావుండగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలను వీలైనంత ఎక్కువగా ఏకగ్రీవం చేసేందుకు వైకాపా నేతలు రంగంలోకి దిగారు. నామినేషన్ల ఘట్టం ముగియడం, ఉపసంహరణకు ఈ నెల 14వరకూ గడువు ఉండటంతో వీలైనన్ని ఎక్కువ ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలను ఏకగ్రీవం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గ పరిధిలో 71 ఎంపీటీసీ స్థానాల్లో 60 ఏకగ్రీవం కానున్నాయని సమాచారం. వెల్దుర్తి మండలంలో 14 స్థానాల్లో విపక్షం నుంచి ఒక్కరే నామినేషన్ వేశారు. రెంటచింతలలో 13, దుర్గిలో 12, కారంపూడిలో 9, నరసరావుపేటలో 6 స్థానాల్లో విపక్షం నుంచి ఒక్కో నామినేషన్ మాత్రమే దాఖలు కావడం గమనార్హం. శ్రీకాకుళం జిల్లాలో 2చోట్ల ఎన్నిక ఏకగ్రీవం కానుంది. కడప, చిత్తూరు జిల్లాల్లో పలు స్థానాలు ఏకగ్రీవం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీంతో మరిన్ని స్థానాల్లో స్థానిక ఎన్నికలు ఏకగ్రీవం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
*చిత్రాలు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సమక్షంలో వైకాపాలో చేరిన ఎమ్మెల్యే కరణం బలరాం
*తనయుడు వెంకటేష్