ఆంధ్రప్రదేశ్‌

విశాఖ టీడీపీకి మరో షాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 11: స్థానిక సంస్థల ఎన్నికల వేళ విశాఖ టీడీపీకి గట్టి షాక్ తగిలింది. పార్టీ వైఖరిని నిరసనగా తాను రాజీనామా చేస్తున్నట్టు రూరల్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు బుధవారం ప్రకటించారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసినట్టు చంద్రబాబుకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఇటీవల కాలం పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలను ఈ సందర్భంగా ఆయన ఏకరవు పెట్టారు. గత ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయానికి అధినేత చంద్రబాబు చేసిన తప్పిదాలే కారణమని ఆరోపించారు. విపక్ష పార్టీ నుంచి 17 మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవడంతో పాటు వారిలో కొంతమందికి మంత్రి పదవులు ఇవ్వడం, నారా లోకేష్‌ను ఎమ్మెల్సీ చేసి మంత్రి స్థానంలో కూర్చోపెట్టడం, తెలంగాణా ఎన్నికల్లో కాంగ్రెస్ పక్షాల నిలవడం వంటి అంశాలు కారణాలుగా పేర్కొన్నారు. దీనితో పాటు చంద్రబాబు చుట్టూ ఉన్న కోటరీ కూడా పార్టీ పరాజయానికి కారణమన్నారు. దీనికి తోడు తాను అధ్యక్షునిగా ఉన్నప్పటికీ తన నియోజకవర్గంలో ఇతరుల జోక్యం కలచివేసిందని, ఇది కూడా తాను రాజీనామా చేయడానికి ఒక కారణంగా పేర్కొన్నారు. తాజాగా పార్టీలో జరుగుతున్న పరిణామాలపై కూడా రమేష్‌బాబు స్పందించారు. ముఖ్యంగా విశాఖను పాలనారాజధానిగా ప్రకటించడాన్ని టీడీపీ వ్యతిరేకించడాన్ని తప్పుపట్టారు. ఈ ప్రాంత ప్రజల మనోభావాలకు విలువ నివ్వకుండా, అమరావతి విషయంలో ఉద్యమించడం తనలాంటి వారిని కలచివేసిందన్నారు. రాజధాని వస్తే ట్రాఫిక్ పెరుగుతుందనో, రౌడీయిజం పెచ్చుమీరుతుందనో చేస్తున్న ప్రచారంలో అర్ధం లేదన్నారు. ఈ విషయంలో జరుగుతున్నదంతా దుష్ప్రచారమేనన్నారు.
*చిత్రం...రాజీనామా పత్రాన్ని విలేఖరులకు చూపుతున్న రూరల్ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్‌బాబు