ఆంధ్రప్రదేశ్‌

పదో వసంతంలోకి వైసీపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మార్చి 11: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పదవ వసంతంలోకి అడుగిడుతోంది. గురువారం వైసీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ‘మహానేత ఆశయాల స్ఫూర్తితో పుట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పదవ సంవత్సరంలోకి అడుగిడుతోంది.. ఈ సుదీర్ఘ ప్రయాణంలో నా వెంట నడిచిన పార్టీ కుటుంబసభ్యులు, ఆదరించిన రాష్ట్ర ప్రజలందరికీ వందనాలు.. ఏపీని ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దేలా మీ అందరి దీవెనలు పార్టీకి ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు’ జగన్ ట్వీట్ చేశారు.