ఆంధ్రప్రదేశ్‌

ఇవి ఎన్నికలా, ఎంపికలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (సిటీ), మార్చి 12: నవాంధ్రప్రదేశ్‌పై అప్పుడు తెలుగుదేశం పార్టీ, ఇప్పుడు వైసీపీ విషయం చిమ్ముతున్నాయని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్, భారతీయ జనతా పార్టీ ఏపీ ఇన్‌చార్జ్ సునీల్ దియోథర్, రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. టీడీపీ పాలనలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా జన్మభూమి కమిటీల పేరుతో రాష్ట్రాన్ని దోచుకుంటే వైసీపీ ప్రభుత్వం విలేజ్ వలంటీర్ల ముసుగులో అరాచకాలకు పాల్పడుతోందని ఆరోపించారు. ప్రస్తుతం స్థానిక సంస్థలకు జరుగుతున్న ఎన్నికలు వైసీపీ సెలక్షన్స్‌లా ఉన్నాయంటూ మండిపడ్డారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో అభ్యర్థులు పోటీలో నిలబడకుండా అడుగడుగునా అధికార పార్టీ అరాచకాలు, దౌర్జన్యాలకు పాల్పడిందన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థుల్లో మనోధైర్యాన్ని నింపి అండగా ఉంటామని అభయమిచ్చారు. స్థానిక సంస్థలకు సంబంధించి బీజేపీ, జనసేన పార్టీల ఎన్నికల విజన్ డాక్యుమెంట్‌ను గురువారం రెండు పార్టీల నేతలు కలిసి ఇక్కడ విడుదల చేశారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సునీల్ దియోథర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్నవి ఎన్నికల్లా లేవని, కేవలం వైసీపీ నేతల ఎంపికలా ఉన్నాయన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని విమర్శించారు. వైసీపీని విమర్శించే హక్కు టీడీపీకి లేనేలేదన్నారు. టీడీపీ హయాంలో ఎన్నికలు నిర్వహించకుండా జన్మభూమి కమిటీలతో రాష్ట్రాన్ని దోచుకుంటే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం కూడా అదేబాటలో విలేజ్ వలంటీర్లు, పోలీసులతో దౌర్జన్యాలకు పాల్పడుతోందన్నారు. నాగరాజు, సర్పరాజుల్లా టీడీపీ, వైసీపీ రాష్ట్రంపై విషం చిమ్ముతున్నాయన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రజలకు ఉన్న ఒకే ఒక్క ప్రత్యామ్నాయం బీజేపీ-జనసేన కూటమి మాత్రమేనన్నారు. ఎన్నికల సందర్భంగా హింస, రౌడీయిజం జగన్, వైసీపీ పార్టీ నేతల నైజానికి అద్దం పడుతున్నాయని ధ్వజమెత్తారు. బురద నుంచే కమలం వికసిస్తుందని, మీరు హింసతో ఎంత బురద సృష్టిస్తే అన్ని కమలాలు అంతగా వికసిస్తాయని చెప్పారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ మాట్లాడుతూ గ్రామస్వరాజ్యం, అభివృద్ధి వికేంద్రీకరణ కోసం జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బెదిరింపులు, దాడులు, దౌర్జన్యాలతో గెలవాలని అధికార పార్టీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. నేరచరిత్ర
ఉన్నవారు రాజకీయాల్లోకి వస్తే ఇలాంటి పరిస్థితులే ఉంటాయన్నారు. నేరచరిత్రపై ప్రజాస్వామ్య పునాదులను ఎలా ఏర్పాటు చేస్తామన్నారు. 151మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ జగన్ ఎన్నికలంటే ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. అధికారుల కళ్లెదుటే అన్యాయం జరుగుతుంటే పట్టించుకోలేదన్నారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియను తన ఆధీనంలోకి తీసుకునేందుకు సైతం రాష్ట్ర ఎన్నికల కమిషన్ వెనకడుగు వేస్తోందన్నారు. ఇలాంటి సమయంలో టీఎన్ శేషన్ వంటి ఎన్నికల అధికారి రాష్ట్రానికి ఎంతో అవసరమన్నారు. పోలీసులు కూడా వైసీపీ కార్యకర్తల్లా ప్రవర్తించండం మరీ దారుణమని విమర్శించారు. దౌర్జన్యంతో నెగ్గాలనుకుంటే ఎలక్షన్లు ఎందుకు? జగన్ రెడ్డి గారూ.. మీ అభ్యర్థులను మాత్రమే నిలబెట్టుకుని ఏకగ్రీవం అని ప్రకటించుకోవచ్చుగా అని వ్యాఖ్యానించారు. ప్రజల హృదయాల్లో గెలవాలే తప్ప దాడులు, భయభ్రాంతులను గురిచేసి మాత్రం కాదన్నారు. నామినేషన్ వేయడానికే అభ్యర్థులు భయపడుతుంటే ఇక ఓటుహక్కును స్వేచ్ఛగా ఎలా వినియోగించుకుంటారని ప్రశ్నించారు. ఏపీ మరో బిహార్‌లా తయారైందని, ప్రశాంత గోదావరి జిల్లాల్లో కూడా వైసీపీ రెచ్చిపోయి హింసకు పాల్పడుతోందని ఆరోపించారు. అదుపుతప్పిన ఎడ్లకు ముకుతాడు వేసినట్లు వైసీపీ రౌడీయిజానికి వేయాల్సిన సమయం వచ్చిందన్నారు. ప్రస్తుత పరిస్థితులను కేంద్రం, గవర్నర్ దృష్టికి తీసుకెళ్తామని పవన్‌కళ్యాణ్ వివరించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ నియంతృత్వానికి ఫ్యాక్షనిజం తోడయితే ఇలాగే ఉంటుందని విమర్శించారు. టెండర్లు వేస్తున్న సమయంలో ఫారాలు లాక్కెళ్లడం, చించివేయడం చూశామని, ఇప్పుడే కొత్తగా నామినేషన్ ఫారాలు చించడం చూస్తున్నామన్నారు. అసలు ఎన్నికలే జరపకుండా నామినేషన్ పద్దతిలో పదవులను భర్తీచేస్తే సరిపోయేదిగా, ఇందుకోసం అర్డినెన్స్ తేవచ్చుగా అని విమర్శించారు. ఎన్నికల్లో గెలవకపోతే మంత్రులు, ఎమ్మెల్యేల పదవులు పోతాయని బెదిరించడం దేనికి సంకేతమన్నారు. ప్రస్తుత తంతు అంతా ఫైనాన్స్ కమిషన్ నిధుల కోసమేనన్నారు. ఎలక్షన్ కమిషన్ అధికారాలను కూడా తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని జగన్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. మద్యం, డబ్బు పంచితే మూడేళ్లు జైలుశిక్ష అంటూ ఆర్డినెన్స్ తెచ్చారని, వైసీపీ వాళ్లు కట్టుబడి ఉంటారా? మీవాళ్లు ఈ చర్యలకు పాల్పడితే సీఎం పదవికి నుండి తప్పుకుంటారా? అంటూ జగన్‌కు కన్నా సవాల్ విసిరారు. సమావేశంలో బీజేపీ నేతలు పురంధ్రీశ్వరి, పాక సత్యనారాయణ, సోము వీర్రాజు, మాధవ్, పైడికొండల మాణిక్యాలరావు, జనసేన పార్టీ నేత నాదెండ్ల మనోహర్, పి రామ్మోహన్‌రావు పాల్గొన్నారు.

*చిత్రం...స్థానిక ఎన్నికల విజన్ డాక్యుమెంట్ విడుదల చేస్తున్న బీజేపీ, జనసేన పార్టీ నేతలు సునిల్ దియోథర్,
పవన్‌కళ్యాణ్, కన్నా లక్ష్మీనారాయణ, తదితరులు