S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

03/18/2020 - 07:02

విజయవాడ: దేశంలో కరోనా ప్రభావం తీవ్రంగా ఉందని, ఈ పరిస్థితుల్లో నిర్ణీత షెడ్యూల్ ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించలేమని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్‌కుమార్ తేల్చిచెప్పారు. మంగళవారం తనకు లేఖ రాసిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి ఈమేరకు వివరిస్తూ ఆయన మూడు పేజీల లేఖ రాశారు.

03/18/2020 - 01:33

అమరావతి: రాష్ట్రంలో ఈ-పంటల విధానం వ్యవసాయ రంగంలో మరో కీలక మలుపు కానుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్ఘాటించారు. ఈ-పంట వల్ల బీమా రిజిస్ట్రేషన్, వ్యవసాయ ఉత్పత్తులకు తగిన ధరలు లభించేందుకు ప్రభుత్వం సత్వరమే చర్యలు తీసుకునే వీలు కలుగుతుందన్నారు.

03/17/2020 - 06:48

గుంటూరు, మార్చి 16: కరోనా వైరస్‌తో ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతుంటే ఇక్కడ ముఖ్యమంత్రి మాత్రం ప్రజల ప్రాణాల కన్నా ఎన్నికలే ప్రధానమన్నట్లుగా వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, విపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. విమానాశ్రయాలు మూసివేస్తూ, దేశ సరిహద్దుల్ని సైతం మూసివేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటం ఎంతమాత్రం మంచిది కాదని విజ్ఞప్తి చేశారు.

03/17/2020 - 06:47

గుంటూరు, మార్చి 16: చంద్రబాబు నాయుడువి నీచ రాజకీయాలని మరోమారు స్పష్టమైందని మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) విమర్శించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా బాబు ఉన్నప్పుడు ఎన్నికల సంఘం ఉన్నతాధికారులపై రుసరుసలాడి, కేంద్ర ఎన్నికల సంఘం అధికారిని కూడా అంతుచూస్తానని బెదిరించిన విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు.

03/17/2020 - 06:45

విజయవాడ, మార్చి 16: స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాల్టీల్లో జరిగిన ఏకగ్రీవాలు, నామినేషన్ల ఉపసంహరణలపై న్యాయ విచారణ జరిపించాలని, అవి కచ్చితంగా జరిగిన ఏకగ్రీవాలో, కాదో తేల్చాలని ఎన్నికల కమిషన్‌ను రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ మంత్రి డా. శైలజానాథ్ డిమాండ్ చేశారు.

03/17/2020 - 06:24

గుంటూరు, మార్చి 16: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి అధికారం ఉండి ఉంటే ఎన్నికల కమిషన్, కోర్టులను కూడా రద్దుచేసేవారని టీడీపీ ఎమ్మెల్సీలు దీపక్‌రెడ్డి, చెంగల్రాయలు విమర్శించారు. మంగళగిరి సమీపంలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో సోమవారం జరిగిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఎన్నికల కమిషనర్‌కు కులాన్ని ఆపాదించడం, ఎన్నికల కమిషన్ విధులను భూతద్దంలో చూపడం సరికాదన్నారు.

03/17/2020 - 06:23

విజయవాడ, మార్చి 16: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర వ్యవసాయ అవసరాలకు 1.5లక్షల టన్నుల మేర యూరియాను అందుబాటులో ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు 45కోట్ల రూపాయలను కేటాయించింది. ఈమేరకు ఏపీ మార్క్‌ఫెడ్‌ను నోడల్ ఏజన్సీగా నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. యూరియా కొనుగోలు సమయంలో మార్క్‌ఫెడ్ తీసుకున్న రుణాలను, దాని వడ్డీని ప్రభుత్వం భరిస్తుంది.

03/17/2020 - 06:22

విజయవాడ, మార్చి 16: దేశంలో కరోనా (కోవిడ్-19) వైరస్ ప్రభావిత కేసుల సంఖ్య ఎక్కువ అవుతున్న నేపథ్యంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించనుంది. దేశంలో క్రమంగా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో వ్యాధి వ్యాప్తిని నిరోధించేందుకు వీలుగా విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని కేంద్ర మానవ వనరుల శాఖ ఆదేశించింది.

03/17/2020 - 06:22

అమరావతి, మార్చి 16: స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియపై బురద జల్లుతున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు బహిరంగ చర్చకు రావాలని రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు సవాల్ విసిరారు. బాబుతో బహిరంగ చర్చకు ముఖ్యమంత్రి జగన్ అవసరం లేదని, తేదీ, స్థలం నిర్ణయిస్తే తాను సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఆరోపణలు చేసి పలాయనం చిత్తగించటం చంద్రబాబు నైజమని విమర్శించారు.

03/17/2020 - 06:21

పుల్లంపేట/సంబేపల్లి, మార్చి 16: కడప జిల్లాలో విదేశాల నుంచి వచ్చిన ఇద్దరికి వైద్యులు ముందస్తు చర్యల్లో భాగంగా కరోనా పరీక్షలు నిర్వహించారు. పుల్లంపేట మండలం కొత్తపేటకు చెందిన సాధు శంకరయ్య తీవ్రమైన జలుబు, దగ్గుతో బాధపడుతుండడం గమనించిన స్థానికులు వైద్యాధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అధికారులు సోమవారం ఆగమేఘాలపై గ్రామానికి చేరుకుని శంకరయ్యను రిమ్స్‌కు తరలించారు.

Pages