ఆంధ్రప్రదేశ్‌

మా నిర్ణయమే ఫైనల్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: దేశంలో కరోనా ప్రభావం తీవ్రంగా ఉందని, ఈ పరిస్థితుల్లో నిర్ణీత షెడ్యూల్ ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించలేమని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్‌కుమార్ తేల్చిచెప్పారు. మంగళవారం తనకు లేఖ రాసిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి ఈమేరకు వివరిస్తూ ఆయన మూడు పేజీల లేఖ రాశారు. ఎన్నికల వాయిదా వల్ల 14వ ఆర్థిక సంఘం నిధులను కేంద్రం నుంచి తెచ్చుకోటానికి ఎలాంటి ఆటంకాలు ఉండవని అభిప్రాయపడ్డారు. కేవలం కరోనా వైరస్ ప్రభావం వల్లనే ఎన్నికలను వాయిదా వేశామన్నారు. దేశంలో కరోనా ప్రభావం తీవ్రంగా ఉందని, ఇప్పటికే పశ్చిమ బెంగాల్, ఒడిశా, మహారాష్టల్రో స్థానిక సంస్థల ఎన్నికలు నిలిపివేశారని ఆయన గుర్తుచేశారు. ఏపీలో కూడా ఈ కారణంతోనే వాయిదా వేశామని, వేరే ఆలోచన లేదని వివరణ ఇచ్చారు. తనకు ఆర్థిక శాఖలో పనిచేసిన అనుభవం ఉందని, ఎన్నికలు ఆలస్యమైనప్పటికీ ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తరువాత కూడా నిధులు తెచ్చుకున్న ఘటనలు అనేకం ఉన్నాయని నిమ్మగడ్డ పేర్కొన్నారీను. రాష్ట్రానికి నిధులు తెచ్చుకోటానికి ఎలాంటి ఆటంకం ఉండబోదన్నారు. ఎన్నికల వాయిదాకు సీఈఎస్ కట్టుబడి ఉందని మరోమారు స్పష్టం చేశారు. తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే అవకాశం లేదన్నారు. కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించిన
పరిస్థితుల్లో ఇక్కడ ఎన్నికలు నిర్వహిస్తే విపత్కర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చే అవకాశం ఉందన్నారు. కాగా, ఎన్నికలను ఎప్పుడు నిర్వహించబోతున్నారనే విషయాన్ని మాత్రం లేఖలో ఎన్నికల ప్రధానాధికారి రమేష్‌కుమార్ ఎక్కడా పేర్కొనలేదు.