ఆంధ్రప్రదేశ్‌

1.5లక్షల టన్నుల యూరియా కొనుగోలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 16: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర వ్యవసాయ అవసరాలకు 1.5లక్షల టన్నుల మేర యూరియాను అందుబాటులో ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు 45కోట్ల రూపాయలను కేటాయించింది. ఈమేరకు ఏపీ మార్క్‌ఫెడ్‌ను నోడల్ ఏజన్సీగా నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. యూరియా కొనుగోలు సమయంలో మార్క్‌ఫెడ్ తీసుకున్న రుణాలను, దాని వడ్డీని ప్రభుత్వం భరిస్తుంది. పంపిణీకి సంబంధించి మార్గదర్శకాలను జారీ చేసింది. గ్రామ సచివాలయాల ద్వారా యూరియా పంపిణీని పర్యవేక్షిస్తారు. యూరియా సరఫరా వివరాలను గ్రామాల్లో రైతుభరోసా కేంద్రాల వద్ద ప్రకటించాలి. భూసార పరీక్ష నివేదిక ఆధారంగానే ఎరువులను పంపిణీ చేయాలి. ప్రాథమిక సహకార కేంద్రాలను ఎరువుల నిల్వ కేంద్రాలుగా ఉపయోగించుకుని, యూరియా పంపిణీని విజయవంతం చేయాలని కోరింది. రిటైల్ డీలర్‌కు గరిష్ఠంగా 20టన్నులను మాత్రమే కేటాయిస్తారు.