ఆంధ్రప్రదేశ్‌

ఏకగ్రీవాలు, ఉపసంహరణలపై న్యాయ విచారణ జరపాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 16: స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాల్టీల్లో జరిగిన ఏకగ్రీవాలు, నామినేషన్ల ఉపసంహరణలపై న్యాయ విచారణ జరిపించాలని, అవి కచ్చితంగా జరిగిన ఏకగ్రీవాలో, కాదో తేల్చాలని ఎన్నికల కమిషన్‌ను రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ మంత్రి డా. శైలజానాథ్ డిమాండ్ చేశారు. సోమవారం ఆంధ్రరత్న భవన్‌లో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, మనిషి సృష్టించిన భయోత్పాతం వంటి వైపరీత్యాలు ఏర్పడినప్పుడు ఎన్నికలను రద్దుచేయవచ్చని గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన ఒక తీర్పులో చెప్పిందన్నారు. ప్రకృతి వైపరీత్యంలో భాగంగా కరోనా వైరస్, స్థానిక ఎన్నికల్లో వైసీపీ నాయకులు సృష్టించిన భయోత్పాతం వల్ల ఎన్నికలు రద్దుచేసే అధికారం ఎన్నికల కమిషన్‌కు ఉందన్నారు. కానీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్‌కుమార్ కేవలం వాయిదా మాత్రమే వేశారని, కాంగ్రెస్ పార్టీ ఈ రెండు కారణాలతో ఎన్నికల రద్దుకు డిమాండ్ చేస్తోందన్నారు. కరోనా వైరస్ విషయంలో ప్రస్తుతం మన దేశం, రాష్ట్రం రెండు, మూడో దశల్లో ఉన్నాయని, మరో రెండు వారాల్లో తగిన చర్యలు తీసుకోకపోతే ఒక్కసారిగా విజృంభించి ఇటలీ, ఇరాన్‌లోని పరిస్థితిలా తయారవుతుందన్నారు. ఒక్కసారిగా 80 జెడ్పీటీసీలకు నామినేషన్ల ఉపసంహరణ జరగడంపై కూడా విచారణ జరిపించాలని శైలజానాథ్ డిమాండ్ చేశారు. నామినేషన్ వేసిన ప్రతి అభ్యర్థిపై కూడా అవసరం అయితే విచారణ జరిపించి, సమయం ఇచ్చి మళ్లీ నోటిఫికేషన్ జారీచేసి వ్యక్తిగత రక్షణతో ఎన్నికలు జరిపించాలన్నారు. విలేఖరుల సమావేశంలో పీసీసీ ఉపాధ్యక్షులు డా. గంగాధర్, మార్టిన్ లూథర్, సీనియర్ నాయకులు లింగంశెట్టి ఈశ్వరరావు, చిలకా విజయ్, నరహరశెట్టి నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు.

*చిత్రం...విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న శైలజానాథ్