ఆంధ్రప్రదేశ్‌

జగన్‌కు అధికారం ఉంటే ఈసీ, కోర్టులనూ రద్దుచేసేవారు: టీడీపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మార్చి 16: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి అధికారం ఉండి ఉంటే ఎన్నికల కమిషన్, కోర్టులను కూడా రద్దుచేసేవారని టీడీపీ ఎమ్మెల్సీలు దీపక్‌రెడ్డి, చెంగల్రాయలు విమర్శించారు. మంగళగిరి సమీపంలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో సోమవారం జరిగిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఎన్నికల కమిషనర్‌కు కులాన్ని ఆపాదించడం, ఎన్నికల కమిషన్ విధులను భూతద్దంలో చూపడం సరికాదన్నారు. స్థానిక ఎన్నికలను ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించకుండా వ్యవస్థలను నాశనం చేయడమే జగన్ ధ్యేయమన్నారు. నిమ్మగడ్డ ప్రసాద్ తమ సంస్థల్లో రూ.700 కోట్లు పెట్టినప్పుడు జగన్‌కు కులం గుర్తుకు రాలేదా.. అని ప్రశ్నించారు. నామినేషన్ వేయకుండా టీడీపీ అభ్యర్థులను అడ్డుకుని వైసీపీ అభ్యర్థులంతా ఏకగ్రీవం అంటూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారన్నారు. నామినేషన్లలో చిన్న తప్పులను చూపి అకారణంగా 280 నామినేషన్లను తిరస్కరించారని, టీడీపీ నేతలను భయపెట్టి 1,486 నామినేషన్లను ఉపసంహరించుకునేలా చేసిన విషయాన్ని జగన్ ఎందుకు చెప్పలేదని నిలదీశారు. అలాగే దౌర్జన్యాలు, ప్రలోభాలతో 2,571 నామినేషన్లను తిరస్కరించారన్నారు. ఈ విషయాలపై జగన్ ఎందుకు నోరుమెదపడం లేదని వారు ప్రశ్నించారు.