ఆంధ్రప్రదేశ్‌

ప్రజల ప్రాణాలతో చెలగాటమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మార్చి 16: కరోనా వైరస్‌తో ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతుంటే ఇక్కడ ముఖ్యమంత్రి మాత్రం ప్రజల ప్రాణాల కన్నా ఎన్నికలే ప్రధానమన్నట్లుగా వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, విపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. విమానాశ్రయాలు మూసివేస్తూ, దేశ సరిహద్దుల్ని సైతం మూసివేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటం ఎంతమాత్రం మంచిది కాదని విజ్ఞప్తి చేశారు. సోమవారం మంగళగిరి సమీపంలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో చంద్రబాబు నాయుడు వివిధ అంశాలపై విలేఖరులతో మాట్లాడారు. గడిచిన 24గంటల్లో కరోనా వైరస్ 9దేశాలకు విస్తరించిందని, బ్రిటీషు రాజదంపతులు, బకింగ్‌హామ్ ప్యాలెస్‌ను ఖాళీచేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. మన దేశంలోనూ మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీ, రాజస్థాన్‌లో కరోనా కేసులు పెరుగుతూ వస్తున్నాయని, ముంబైలో 144 సెక్షన్ పెట్టారని గుర్తుచేశారు. ఇంతటి విపత్కర పరిస్థితులు నెలకొని ఉంటే ముఖ్యమంత్రి జగన్ చాలాతేలిగ్గా మాట్లాడుతూ పారాసిటమల్ వేస్తే సరిపోతుందని, బ్లీచింగ్ పౌడర్ చల్లితే కంట్రోల్ అవుతుందంటూ నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఈవిషయమై జాతీయ మీడియా మొత్తం హేళన చేస్తూ రచ్చరచ్చ చేశాయని, చివరకు జగన్‌కు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలంటూ జోకులు పేలాయన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు సీఎస్ లేఖ రాయడాన్ని చంద్రబాబు తప్పుబట్టారు. ఇది ఒక బాధ్యత లేకుండా రాసిన లేఖ అని, వచ్చే మూడునాలుగు వారాల్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందదని ఎలా సర్ట్ఫికెట్ ఇస్తారంటూ నిలదీశారు. దీన్నిబట్టి చూస్తే సీఎస్‌కు కరోనా వైరస్‌పై ఏమాత్రం అవగాహన లేదని భావించాల్సి వస్తుందన్నారు. ఫ్రాన్స్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయని ఇక్కడి వైసీపీ నేతలు అంటున్నారని, అక్కడి ఎన్నికల్లో 20శాతం పోలింగ్ తగ్గిపోయిందని తెలిపారు. ఫ్రాన్స్‌లో ఒకేరోజు 29మంది మృత్యువాత పడగా 900మందికి వైరస్ సోకిందని, మొత్తంగా అక్కడ 5,400 మందికి సోకటంతో పెద్ద అంశంగా మారిందన్నారు. ప్రజాసమూహాలుగా ఏర్పాటయ్యే కార్యక్రమాలను నిరోధించాలని ఓపక్క కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు పంపిందని, కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాలను, సూచనలను మన రాష్ట్రంలో ఎక్కడా పాటించడం లేదన్నారు. కరోనా నియంత్రణపై దేశాలు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పరిగెత్తుతుంటే మన రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రం చీమకుట్టినట్టైనా లేదని విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిపాలేనికి చెందిన ఓ మహిళ కాకినాడలో చికిత్స పొందుతూ కరోనా లక్షణాలతో మృతిచెందిందని గుర్తుచేశారు. ఇంతటి ప్రమాద ఘంటికలు మోగుతుంటే ప్రభుత్వం మాత్రం మీనమేషాలు లెక్కిస్తోందని మండిపడ్డారు. వచ్చే రెండు, మూడు వారాలు ఎంతో సమస్యాత్మకమైనవని, ప్రభుత్వం ఇప్పటికైనా మొద్దునిద్ర వదిలి తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి మాత్రం పైశాచిక ఆనందంతో ఎన్నికలు పెట్టాలని సుప్రింకోర్టుకు వెళ్లారని, బాధ్యత, బాధలేని వ్యక్తి ఈ ముఖ్యమంత్రి అని విమర్శించారు. స్థానిక ఎన్నికలు నిర్వహించకుండా ఇన్నిరోజులు ఎక్కడ నిద్రపోయారంటూ నిలదీశారు. ఎన్నికలపై ఉండే ధ్యాసలో కనీసం 10శాతం కూడా కరోనా వైరస్ నియంత్రణపై లేకపోవడం దురదృష్టకరమన్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో ఈ ముఖ్యమంత్రి మనకు ఉండటం రాష్ట్ర ప్రజల దురదృష్టమని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఉదాసీనంగా ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆడబిడ్డలపై అత్యంత ఘోరంగా పోస్ట్‌లు పెడుతున్నారని, ఈవిషయమై డీజీపీ సిగ్గుతో తలదించుకోవాలన్నారు. రాష్ట్రంలో పొలిటికల్ టెర్రరిజంతో పాటు ఖాకీ టెర్రరిజం నడుస్తోందని, ఇది సాగదని, దీనిపై డీజీపీకి లేఖ రాస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఛీకొట్టే పరిస్థితి తెచ్చుకోవద్దని హితవు పలికారు. బెదిరించి, భయభ్రాంతులకు గురిచేసి ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని, డాక్యుమెంట్లతో సహా అన్ని సాక్ష్యాధారాలు సేకరిస్తున్నామని చెప్పారు. క్రిమినల్ ప్రాసిక్యూషన్‌కు వెళతామని, వీరిని వదిలిపెట్టే సమస్యే లేదని చంద్రబాబు హెచ్చరించారు.

*చిత్రం... టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శ