ఆంధ్రప్రదేశ్‌

కడప జిల్లాలో ఇద్దరికి కరోనా పరీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుల్లంపేట/సంబేపల్లి, మార్చి 16: కడప జిల్లాలో విదేశాల నుంచి వచ్చిన ఇద్దరికి వైద్యులు ముందస్తు చర్యల్లో భాగంగా కరోనా పరీక్షలు నిర్వహించారు. పుల్లంపేట మండలం కొత్తపేటకు చెందిన సాధు శంకరయ్య తీవ్రమైన జలుబు, దగ్గుతో బాధపడుతుండడం గమనించిన స్థానికులు వైద్యాధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అధికారులు సోమవారం ఆగమేఘాలపై గ్రామానికి చేరుకుని శంకరయ్యను రిమ్స్‌కు తరలించారు. శంకరయ్య రెండు వారాల క్రితం కువైట్ నుంచి తిరిగివచ్చాడు. వచ్చినప్పటి నుంచి జలుబు, దగ్గు లక్షణాలతో బాధపడుతుండడంతో వలంటీర్లు, ఆశావర్కర్లు వైద్యాధికారుల దృష్టికి తీసుకువచ్చారు. కాగా శంకరయ్యను మూడు రోజుల పాటు రిమ్స్‌లో అబ్జర్వేషన్‌లో ఉంచుతామని వైద్యులు శేఖర్ తెలిపారు. కరోనా శాంపిల్స్ తీసి పూనే ల్యాబ్‌కు పంపుతామని, అక్కడి నుంచి నివేదిక వచ్చిన తరువాత తదుపరి చికిత్స అందజేస్తామన్నారు. ఆలాగే సంబేపల్లె మండలం దుద్యాల గ్రామానికి చెందిన గర్భిణి కువైట్ నుండి శనివారం స్వగ్రామానికి చేరుకుంది. ప్రసవం కోసం వచ్చిన ఆమె గురించి తెలుసుకున్న వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది వైద్యపరీక్షలు నిర్వహించారు. ఎలాంటి కరోనా లక్షణాలు ఆమెలో కనిపించలేదు. ఆమె ఆరోగ్యంగా ఉందని సిబ్బంది తెలిపారు.