ఆంధ్రప్రదేశ్‌

కరోనాపై విద్యార్థులకు అవగాహన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 16: దేశంలో కరోనా (కోవిడ్-19) వైరస్ ప్రభావిత కేసుల సంఖ్య ఎక్కువ అవుతున్న నేపథ్యంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించనుంది. దేశంలో క్రమంగా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో వ్యాధి వ్యాప్తిని నిరోధించేందుకు వీలుగా విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని కేంద్ర మానవ వనరుల శాఖ ఆదేశించింది. దీంతో ఎస్సీఈఆర్టీ రాష్ట్ర శాఖ జిల్లా విద్యాశాఖాధికారులకు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. తరచూ చేతులు కడుక్కోవడం, దగ్గు, తుమ్ములు వచ్చినప్పుడు చేతిరుమాలు అడ్డుపెట్టుకోవడం, టిస్స్యూ పేపరు వినియోగం, పొడుగు చేతుల చొక్కా ధరించడం, అనారోగ్యంగా ఉన్నప్పుడు పాఠశాలకు దూరంగా ఉండటం వంటి అంశాలపై అవగాహన కల్పించనున్నారు. సమూహాలకు, సమావేశాలకు దూరంగా ఉండటం వంటి అంశాలను ఆనంద వేదిక కార్యక్రమంలో వివరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.