S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

08/17/2019 - 00:24

అమరావతి, ఆగస్టు 16: కృష్ణానదీ పరివాహక లంక గ్రామాలను వరద నీరు చుట్టుముట్టింది. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల జలాశయాల నుంచి లక్షలాది క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల కావటంతో కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని తీర గ్రామాలు భయం గుప్పెట్లో జీవనం సాగిస్తున్నాయి.

08/17/2019 - 00:23

విజయవాడ, ఆగస్టు 16: ప్రభుత్వాసుపత్రి బ్లడ్ బ్యాంకులో అన్ని గ్రూపుల రక్త నిల్వలు అందుబాటులో ఉండేలా చూడాలని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సూచించారు. శుక్రవారం విజయవాడ గుణదలలోని కొత్త ప్రభుత్వాసుపత్రి సందర్శనకు వచ్చిన రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ పి నాంచారయ్య, వైద్యాధికారులు, పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు.

08/17/2019 - 00:23

అమరావతి, ఆగస్టు 16: ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే తమ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు నివాసంపై డ్రోన్లు వదిలిందని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు ఆరోపించారు. వరద పరిస్థితిని అంచనా వేసేందుకు డ్రోన్లు వదిలామని చెప్తున్న ప్రభుత్వం ఇతర ప్రాంతాలను ఎందుకు చిత్రీకరించలేదని ప్రశ్నించారు.

08/17/2019 - 00:22

విజయవాడ, ఆగస్టు 16: వరద సహాయక చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు మండిపడ్డారు. ఒకవైపు వరద నీటితో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే, తన ఇల్లు ఎప్పుడు మునుగుతుందా అని కళ్లల్లో వత్తులు వేసుకుని రాష్ట్ర మంత్రులు చూస్తున్నారంటూ ట్విట్టర్‌లో మండిపడ్డారు. తన ఇంటిమీద పెట్టిన శ్రద్ధ, వరదలపై పెట్టి ఉంటే ప్రజలకు ఇబ్బందులు తప్పేవన్నారు.

08/17/2019 - 00:42

విజయవాడ, ఆగస్టు 16: దశల వారీగా మధ్య నిషేధాన్ని రాష్ట్రంలో అమలు చేసే చర్యల్లో భాగంగా కొత్త మద్యం విధానాన్ని శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని ఏపీ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషనే మద్యం దుకాణాలను నిర్వహించనుంది. రాష్ట్రంలో 3500 దుకాణాల మాత్రమే ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది. అక్టోబర్ నుంచి కొత్త మద్య విధానం అమల్లోకి రానుంది.

08/16/2019 - 23:12

విజయవాడ, ఆగస్టు 16: విజయవాడ వద్ద ప్రకాశం బ్యారేజీకి అంతకంతకూ వరద నీరు పోటెత్తుతోంది. శుక్రవారం రాత్రి తొమ్మిది గంటల సమయానికి 7 లక్షల 70వేల క్యూసెక్కుల వరద నీరు సముద్రంలోకి వదిలేస్తున్నారు. శనివారం తెల్లవారుజాము సమయానికి 8 లక్షల క్యూసెక్కులకు చేరుకోగలదని అధికారులు చెబుతున్నారు.

08/16/2019 - 23:08

గుంటూరు, ఆగస్టు 16: చంద్రబాబు నివాస పరిసర ప్రాంతాల్లో వరద పరిస్థితిని సమీక్షించేందుకు వచ్చిన రాష్ట్ర మంత్రులు బొత్స సత్యనారాయణ, అనిల్‌కుమార్ యాదవ్, వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణులను తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు అడ్డుకున్నారు.

08/16/2019 - 23:07

గుంటూరు, ఆగస్టు 16: వరద ప్రవాహాల నియంత్రణలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, బాధితులను ఆదుకునేందుకు పార్టీ కార్యకర్తలు, నాయకులు సహాయక చర్యలు చేపట్టాలని తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

08/16/2019 - 23:06

గుంటూరు, ఆగస్టు 16: ప్రజాస్వామ్య వ్యవస్థలో దాడులు సరికాదని, ప్రజలపై వైసీపీ నేతలు దాడులు చేస్తే చూస్తూ ఊరుకోబోమని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పష్టంచేశారు. శుక్రవారం గుంటూరులో జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. పల్నాడు ప్రాంతంలో బీజేపీ శ్రేణులపై వైసీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడుతున్నారని, ఇది మంచి పద్ధతి కాదన్నారు.

08/16/2019 - 23:06

అమరావతి, ఆగస్టు 16: రాష్ట్రంలో ఎన్నడూలేనంతగా నదులు ఉప్పొంగి వరదలతో జలాశయాలు కళకళలాడుతుంటే టీడీపీ రాద్ధాంతం చేయడం విడ్డూరంగా ఉందని రైతుమిషన్ ఉపాధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి వ్యాఖ్యానించారు.

Pages