ఆంధ్రప్రదేశ్‌

పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం పెంపు గర్హనీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 17: అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు గణనీయంగా తగ్గినా ఆ ప్రయోజనాన్ని వినియోగదారులకు ఇవ్వకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని పెంచడం గర్హనీయమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో నిరసన తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్ ముడిచమురు ధర 63డాలర్ల నుంచి 33డాలర్లకు తగ్గిందన్నారు. ఆమేరకు మన దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు సగానికి సగం తగ్గాలి కానీ కేంద్ర ప్రభుత్వం వీటిపై ఎక్సైజ్ సుంకాన్ని లీటర్‌కు మూడు రూపాయలు పెంచటం అన్యాయమన్నారు.