ఆంధ్రప్రదేశ్‌

*హమ్మయ్య వచ్చేశాం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం/అక్కిరెడ్డిపాలెం, మార్చి 18: ఫిలిప్పీన్స్‌లో వైద్య విద్యనభ్యసిస్తూ కౌలాలంపూర్‌లో చిక్కుకున్న భారత విద్యార్థులు ఎట్టకేలకు విశాఖ చేరుకున్నారు. సుమారు 185 మంది వైద్యవిద్యార్థులు ఫిలిప్పీన్స్ నుంచి కౌలాలంపూర్ మీదుగా స్వస్థలాలకు చేరుకోవాల్సి ఉంది. కరోనా కారణంగా ఇతర ప్రాంతాల నుంచి రాకపోకలు నిషేధం అమలవుతున్న నేపథ్యంలో వీరంతా కౌలాలంపూర్ విమానాశ్రయంలో చిక్కుకున్నారు. తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం చొరవ చూడపడంతో ప్రత్యేక విమానంలో వీరిని బుధవారం రాత్రి విశాఖకు రప్పించారు. వీరిలో తెలుగు రాష్ట్రాల విద్యార్థులతో పాటు కర్నాటక, తమిళనాడు ప్రాంతాలకు చెందిన వారు కూడా ఉన్నారు. వీరికి విమానాశ్రయంలో ప్రత్యేక పరీక్షల అనంతరం ఎవరి సొంత ప్రాంతాలకు వారిని
పంపేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక బస్సుల్లో పోలీసు ఎస్కార్టుతో వీరిని చెన్నై, బెంగళూరు ప్రాంతాలకు తరలిస్తున్నారు. వీరి వివరాలు సేకరించిన అధికారులు నిరంతర నిఘా ఉంచనున్నారు. వీరిలో కొంతమందిని 14 రోజుల పాటు పర్యవేక్షించేందుకు విశాఖలోని పలు ఆసుపత్రుల్లోని క్వారంటైన్ సెంటర్లలో ఉంచే అవకాశం ఉందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. వీరితో పాటు ఉత్తరాదికి చెందిన కొంతమంది కూడా విశాఖ చేరుకోగా, వీరిని ఢిల్లీ విమానంలో తిరిగి పంపించినట్టు తెలిసింది.
*చిత్రం... విశాఖ విమానాశ్రయం నుంచి బయటకు వస్తున్న కౌలాలంపూర్ బాధితులు