ఆంధ్రప్రదేశ్‌

ఈసీ ఆదేశాలు బేఖాతరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, మార్చి 17: ఎన్నికల కోడ్ నిబంధనలపై కనీస అవగాహన కూడా లేకుండా చిత్తూరులో అధికారులు వ్యవహరిస్తున్నారు. దివంగత మాజీ ప్రజాప్రతినిధులు, దివంగత రాజకీయ ప్రముఖుల విగ్రహాలకు ముసుగులు వేయకూడదని ఎన్నికల కమిషన్ ఓ వైపు చెబుతున్నా అధికారులు మాత్రం ఈసీ నిబంధనలు పెడచెవిన పెడుతున్నారు. కేవలం ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులు, బతికి ఉన్న ఆయా రాజకీయ పార్టీల నాయకుల విగ్రహాలు, శిలాఫలకాలు, ఇతరత్రా ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ ఆస్తులున్న ప్రాంతాల్లో ఉన్న వారి ఫొటోలకు మాత్రమే ఎన్నికల కోడ్ ముగిసేంత వరకు ముసుగులు, స్టిక్కర్లను ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే ఇలాంటి విషయాలేమీ పట్టని అధికారులు మాత్రం అందుకు విరుద్ధంగా గతంలో ప్రజాప్రతినిధులుగా, రాజకీయ నాయకులుగా వెలుగొందిన దివంగత నాయకుల విగ్రహాలు, చిత్రపటాలకు ముసుగులు వేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఈనెల 10న రాష్ట్ర ఎన్నికల కమిషన్ నెంబర్ 95/ఎస్‌ఈసీ-బీ1/2020 ద్వారా ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ విషయంగా జారీ చేసిన ఉత్తర్వుల్లోనూ ఈ విషయాన్ని విశదీకరించారు. సంబంధిత ఉత్వర్వులు ఉన్నా చిత్తూరు నగరంలోని పలు కూడళ్లలోని దివంగత ముఖ్యమంత్రులు వైఎస్సార్, ఎన్‌టీఆర్ విగ్రహాలకు అధికారులు ఎంచక్కా ముసుగులు ధరించి కోడ్‌ను పక్కాగా అమలు చేస్తున్నట్లు చెప్పుకొస్తుండటం గమనార్హం. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ఉత్తర్వుల మేరకు చిత్తూరు నగరంలోని పలు కూడళ్లలో ఉన్న దివంగత ముఖ్యమంత్రులు, ఇతర దివంగత రాజకీయ ప్రముఖుల విగ్రహాలకు ఏర్పాటు చేసిన ముసుగులను తొలగించాల్సి ఉంది.

*చిత్రాలు.. ఎన్నికల కోడ్ పేరుతో చిత్తూరు జడ్పీ కార్యాలయ ఆవరణలోని దివంగత ముఖ్యమంత్రులు వైఎస్సార్, ఎన్‌టీఆర్ విగ్రహాలకు ముసుగులు వేసిన దృశ్యం