S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

08/20/2019 - 04:30

అనంతపురం, ఆగస్టు 19: కృష్ణానదికి వరద నేపథ్యంలో వరద, డ్రోన్ రాజకీయాలు తెరపైకి తెచ్చి పరస్పర ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటుండటం జుగుప్స కలిగిస్తోందని, ఈ బురద రాజకీయాలు మాని ఇబ్బందులు పడుతున్న ప్రజలకు తక్షణం సహాయ కార్యక్రమాలు చేపట్టాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు హితవు పలికారు.

08/20/2019 - 04:29

కోడుమూరు, ఆగస్టు 19: తేలును చూడగానే ఒళ్లు గగుర్పొడుస్తుంది. అలాంటి తేళ్లను తలపైన, నోట్లే వేసుకుంటే ఇంకేమన్నా ఉందా.. అయితే కర్నూలు జిల్లా కోడుమూరువాసులు మాత్రం శ్రావణమాసంలో సమీపంలోని కొండపై కనిపించే తేళ్లతో ఆడుకుంటారు. వాటిని పట్టుకుని తల, ఒంటిపై వేసుకుంటారు. నోట్లో పెట్టుకుంటారు. అయినా ఆ తేళ్లు ఏమీ చేయవు. ఇదంతా కొండలరాయుడి మహత్యం అని చెబుతారు.

08/20/2019 - 04:27

విజయవాడ, ఆగస్టు 19: బీహాల్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రా మృతి పట్ల రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. మూడుసార్లు బీహార్ ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా నిస్వార్థంగా సేవలు అందించారని గవర్నర్ తెలిపారు. మిశ్రా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

08/20/2019 - 04:27

తెనాలి, ఆగస్టు 19: కృష్ణానది వరద బాధితులను రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన ఆదుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లాలో కృష్ణానది పరివాహక ప్రాంతాలలో ముంపునకు గురైన లంక గ్రామాలలో సోమవారం కన్నా పర్యటించారు. కృష్ణాజిల్లా మోపిదేవి నుండి గుంటూరు జిల్లా రేపల్లె, కొల్లూరు, భట్టిప్రోలు మండలాలలో వరద కారణంగా నీటమునిగిన గ్రామాల ప్రజలను ఆయన పరామర్శించారు.

08/20/2019 - 04:26

తిరుపతి, ఆగస్టు 19: శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న చిత్తూరు జిల్లాలో శేషాచల కొండల్లో ఎన్నో అరుదైన జంతువులున్నాయి. 82,500 హెక్టార్లలో విస్తరించి ఉన్న ఏడు కొండల్లో, 2,700 హెక్టార్ల అటవీప్రాంతం మాత్రమే టీటీడీ పరిధిలో ఉంది. ఈ ప్రాంతంలోని అరుదైన వృక్ష, జంతు, పక్షి జాతులకు సంబంధించిన తిరుమలకు వచ్చే యాత్రికులకు అవగాహన కల్పించేందుకు టీటీడీ అటవీశాఖ చర్యలు చేపట్టింది.

08/20/2019 - 04:26

విజయవాడ(సిటీ), ఆగస్టు 19: అత్యంత భద్రత ఉన్న మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఇంటిని డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించాలని వైసీపీ నేతలే ప్రయత్నించారని మాజీ మంత్రి జవహర్ ఆరోపించారు. చంద్రబాబు ఇంటిని డ్రోన్‌తో చిత్రీకరించింది వారే అని ట్వీట్ల ద్వారా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బయటపడ్టారని సోమవారం ట్విట్టర్‌లో జవహర్ పేర్కొన్నారు.

08/20/2019 - 04:25

విజయవాడ(సిటీ), ఆగస్టు 19: కష్ట సమయాల్లో ఎవరి పనితనం ఏమిటో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఎవరి పనితీరు ఎంటో ప్రజలు తేల్చుకుంటారు విజయసాయిరెడ్డీ.. అంటూ సోమవారం ట్విట్టర్‌లో వెంకన్న వ్యాఖ్యానించారు.

08/20/2019 - 04:24

విజయవాడ(సిటీ), ఆగస్టు 19: వరద నీటిలో మునిగిన ప్రతిపక్షనేత చంద్రబాబు ఇంటిని డ్రోన్ కెమెరాతో చిత్రీకరిస్తే హత్యకు కుట్ర పన్నినట్లా అని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. వరద వస్తే తన పరువు గంగ పాలవుతుందని ముందే ఉహించిన చంద్రబాబు బ్యారేజీ గేట్లు తెరవక ముందే హైదరాబాద్ పరారయ్యారని సోమవారం ట్విట్టర్ వేదికగా విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.

08/20/2019 - 04:24

గుంటూరు, ఆగస్టు 19: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే వివిధ శాఖల ప్రభుత్వ ఉద్యోగులు సమస్యల పరిష్కారం ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోక పోవడం సరికాదని టీడీపీ మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత అన్నారు.

08/20/2019 - 04:23

గుంటూరు, ఆగస్టు 19: రాష్ట్రంలో ఏడుగురు అదనపు ఎస్‌పీలను బదిలీ చేస్తూ సోమవారం డీజీపీ గౌతమ్ సవాంగ్ ఉత్తర్వులు జారీచేశారు. వెయింటింగ్‌లో ఉన్న అడిషనల్ ఎస్‌పీ ఎం వెంకటేశ్వర్లును గుంటూరు అర్బన్ క్రైంకు బదిలీ చేశారు.

Pages