ఆంధ్రప్రదేశ్‌

ప్రధాని మోదీ సూచనలు పాటిద్దాం: సుజనాచౌదరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 21: దేశంలో ప్రస్తుతం అత్యంత ప్రమాదకరమైన కరోనా రెండో దశలో ఉందని, ఇది మూడో దశలోకి ప్రవేశించకుండానే ప్రధాని నరేంద్ర మోదీ చేసిన సూచనలన్నీ తప్పక పాటిద్దామని రాజ్యసభ సభ్యుడు వై సుజనాచౌదరి రాష్ట్ర ప్రజలకు పిలుపిచ్చారు. అందరం కలసికట్టుగా కరోనాపై విజయం సాధిద్దామని శనివారం ఆయన ఒక ప్రకటనలో ఆకాంక్షించారు. కరోనా వ్యాప్తితో ప్రపంచ దేశాలన్నీ అతలాకుతలం అవుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ దీన్ని జాతీయ విపత్తుగా ప్రకటించి ముందస్తు చర్యలు తీసుకుంటున్నారన్నారు. ఇప్పటికే అమలుచేస్తున్న స్వచ్ఛ భారత్ వల్ల, మన సంప్రదాయాలు, ఆహారపు అలవాట్ల కారణంగా మిగతా ప్రపంచంతో పోలిస్తే మనం మెరుగైన స్థితిలో ఉన్నామన్నారు. ఆదివారం ఉదయం 7నుంచి రాత్రి 9గంటల వరకు ప్రతిఒక్కరూ జనతా కర్ఫ్యూ పాటించాలని కోరారు. ఇదిలావుంటే రాష్ట్ర ప్రభుత్వం దొడ్డిదారిన విజిలెన్స్ కమిషన్, కమిషనరేట్ ఆఫ్ ఎంక్వైరీ కార్యాలయాలను కర్నూలుకు తరలించేందుకు జారీ చేసిన జీవోను హైకోర్టు నిలుపుదల చేయడం హర్షణీయమని సుజానాచౌదరి అన్నారు.