S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

08/19/2019 - 05:46

చిన్నచింతకుంట, ఆగస్టు 18: అమరచింత సంస్థానాధీశుడు, ముక్కెర వంశీయుల్లో ఒకరైన మాజీ ఎమ్మెల్యే రాజాసోంభూపాల్‌దొర (92) ఆదివారం హైదరాబాద్‌లో కన్నుమూశారు. 1927 మార్చిలో హైదరాబాద్‌లో జన్మించిన ఆయన 1962లో అమరచింత సంస్థానంలో రాజుగా పట్ట్ట్భాషేకం పొందారు. 1972 నుంచి 78 వరకూ అమరచింత ఎమ్మెల్యేగా ఎకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ తరువాత కాంగ్రెస్‌పార్టీలో చేరి మూడుసార్లు ఎమ్మెల్యేగా పని చేశారు.

08/18/2019 - 02:13

గుంటూరు: దేశంలో సుదీర్ఘకాలం అత్యున్నత పదవుల్లో పనిచేసి, తీవ్రవాదుల నుంచి ముప్పు పొంచివున్న నాయకుల భద్రతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే రక్షణ ప్రశ్నార్ధకంగా మారుతోందని తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు ఆందోళన వ్యక్తం చేశారు.

08/18/2019 - 02:08

విజయవాడ, ఆగస్టు 17: గత రెండు రోజులుగా కృష్ణానది పరి వాహక ప్రాంతాన్ని వణికించిన వరద ప్రవాహం శనివారం కొంచెం తగ్గుముఖం పట్టడంతో అటు తీవ్ర ప్రాంత ప్రజలు ఇటు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

08/18/2019 - 02:06

గుంటూరు, ఆగస్టు 17: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం తనపై కక్ష సాధించేందుకు రాష్ట్రానికి నష్టం వాటిల్లే విధంగా, పేదలను ఇబ్బందులకు గురి చేస్తోందని ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తంచేశారు. శనివారం కృష్ణా, గుంటూరు జిల్లాల తెలుగుదేశం పార్టీ నేతలతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

08/18/2019 - 07:04

కడప: కడప ఆకాశవాణి కేంద్రం క్రమక్రమంగా నిర్వీర్యమవుతోంది. ఆకాశవాణిపై జిల్లా నాయకులకు ఏమాత్రం అవగాహన లేకపోవడంతో దీనిపై పెద్దగా దృష్టి పెట్టలేదనిపిస్తోంది. రాజకీయ నిర్లక్ష్యానికి గురైన కడప ఆకాశవాణి కేంద్రం క్రమక్రమంగా మసకబారుతోంది. ఒకప్పుడు కళాకారులు, సాహిత్యకారులు, 120 మంది ఉద్యోగులతో కళకళలాడిన ఆకాశవాణి కేంద్రం ఇప్పుడు నిర్మానుష్యంగా ఈసురోమంటోంది.

08/18/2019 - 02:04

విజయవాడ, ఆగస్టు 17: రాయలసీమ ప్రాంతానికి మేలు చేయాలని అనుకుంటే తక్షణమే కృష్ణానదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని, రాయలసీమకు నీళ్లివ్వడంపై బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ వద్ద వ్యక్తం చేసిన అభ్యంతరాలను ఉమసంహరించుకోవాలని కోరుతూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ శనివారం తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్‌రావుకు బహిరంగ లేఖ రాశారు.

08/18/2019 - 02:03

గుంటూరు, ఆగస్టు 17: రాష్ట్రంలోని ప్రజలు ఐదేళ్లుగా కరవుకాటకాలతో నానా ఇబ్బందులు పడ్డారని, దశాబ్దకాలం తర్వాత కృష్ణానదికి వరద రావడంతో రాష్ట్రానికి కలకళ వచ్చిందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు పేర్కొన్నారు.

08/18/2019 - 02:02

గుంటూరు, ఆగస్టు 17: వరదలు వచ్చి, లోతట్టు ప్రాంతాలు మునిగిపోతుంటే, నిరాశ్రయులను ఆదుకోకుండా మంత్రులు, ప్రజాప్రతినిధులు కృష్ణా కరకట్ట చుట్టూ తిరగడం శోచనీయమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శనివారం ఒక ప్రకటనలో దుయ్యబట్టారు.

08/18/2019 - 02:01

విజయవాడ, ఆగస్టు 17: రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ శనివారం కృష్ణానది వరద ముంపు ప్రాంతాలను ప్రత్యేక హెలికాప్టర్ నుంచి పరిశీలించారు. కాకినాడలోని జేఎన్టీయు స్నాతకోత్సవంలో పాల్గొనడానికి ఆయన ఉదయం విజయవాడ విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరారు. మార్గంమధ్యలో విజయవాడ పరిసరాల్లో కృష్ణానది పరీవాహక ప్రాంతాల్లో ముంపు ప్రదేశాలను, వివిధ గ్రామాల్లో ముంపునకు గురైన పంట పొలాలను పరిశీలించారు.

08/18/2019 - 02:00

విజయవాడ, ఆగస్టు 17: ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసెస్ నిబంధనలకు, 2005లో జారీ అయిన 90 నంబర్ జీవోకు విరుద్ధంగా ఏపీ గవర్నమెంట్ ఎంప్లారుూస్ అసోసియేషన్‌కు గుర్తింపునిస్తూ జారీ అయిన 103 జీవోను తక్షణం రద్దు చేయాలని ఏపీ ఎన్జీఓ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్ చంద్రశేఖర్‌రెడ్డి, బండి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.

Pages