S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

08/21/2019 - 04:20

విజయవాడ, ఆగస్టు 20: ప్రతి పార్లమెంట్ పరిధిలో ఒక నైపుణ్యాభివృద్ధి శిక్షణ సంస్థను ఏర్పాటు చేస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎం శంకరనారాయణ తెలిపారు. మంగళవారం వెలగపూడి సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో బీసీ సంక్షేమ పథకాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. బీసీ సంక్షేమ శాఖ కార్పొరేషన్ల ద్వారా రాజకీయాల కతీతంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తామన్నారు.

08/21/2019 - 04:18

విశాఖపట్నం, ఆగస్టు 20: రాజధాని అమరావతి విషయంలో వైసీపీ ప్రభుత్వంలో కీలక నేతల వ్యాఖ్యలు కలకలం రేకెత్తిస్తున్నాయి. కృష్ణానదికి వరదతో మాజీ సీఎం నివాసం ముంపునకు గురైన నేపథ్యంలో విశాఖలో సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ రాజధాని అమరావతిపై కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి నిర్మాణంపై మరోసారి విస్తృత చర్చ జరగాల్సి ఉందని పేర్కొనడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

08/21/2019 - 04:18

కైకలూరు, ఆగస్టు 20: సిద్ధాంతాలు కలిగిన ఏకైక పార్టీ బీజేపీ అని, 2024లో జరిగే ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్క కార్యకర్త శ్రమించాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ పిలుపునిచ్చారు. మంగళవారం కృష్ణాజిల్లా కైకలూరు సీతారామ ఫంక్షన్ హాలులో జరిగిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు.

08/21/2019 - 04:17

గుంటూరు, ఆగస్టు 20: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులను రద్దు చేస్తూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నత పాఠశాలల్లో ఉన్న 303 ఎస్‌జీటీ పోస్టులను రద్దు చేసి వాటిస్థానే పీఈటీ పోస్టులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

08/21/2019 - 04:16

విజయవాడ, ఆగస్టు 20: ఉండవల్లి కరకట్టపై రాష్ట్ర ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటిపై ఇద్దరు ఆగంతకులు ఎటువంటి అనుమతులు లేకుంతా డ్రోన్ల కెమెరాలతో చిత్రీకరించటం వెనుక ఎలాంటి కుట్ర లేదని, దీనిని రాజకీయం చేయవద్దని డీజీపీ గౌతం సవాంగ్ చెప్పటం తగదని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య అభ్యంతరం వ్యక్తం చేశారు.

,
08/21/2019 - 04:11

మచిలీపట్నం, ఆగస్టు 20: ఆంధ్రుల రాజధాని అమరావతిని ముంచేందుకే రాష్ట్ర ప్రభుత్వం కృత్రమ వరదను సృష్టించిందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు తీవ్రమైన ఆరోపణలు చేశారు. వరద కారణంగా కృష్ణాజిల్లాలో ముంపునకు గురైన ప్రాంతాల్లో మంగళవారం చంద్రబాబు నాయుడు విస్తృతంగా పర్యటించారు.

08/21/2019 - 04:08

విజయవాడ, ఆగస్టు 20: గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం వద్ద ప్రజాదర్బార్‌ను 82.5 లక్షల రూపాయలతో నిర్మించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం పాలనామోదాన్ని మంగళవారం తెలిపింది. ప్రజలను ప్రతి రోజు గంట సేపు కలుసుకుని, నేరుగా వినతులు స్వీకరించేందుకు వీలుగా ప్రజాదర్బార్‌ను నిర్మించేందుకు ప్రతిపాదించడం తెలిసిందే. ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది.

08/21/2019 - 04:07

విజయవాడ, ఆగస్టు 20: రాష్ట్రంలో చేపట్టిన రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ ప్రక్రియకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్‌మాల్యాతో రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులపై మంగళవారం సీఎస్ సమీక్షించారు.

08/21/2019 - 04:07

విజయవాడ, ఆగస్టు 20: దుర్గగుడి ఈవో కోటేశ్వరమ్మ బదిలీ కానున్నారు. ఆ స్థానంలో అన్నవరం దేవస్థానంలో కార్యనిర్వాహణాధికారిగా పని చేస్తున్న సురేష్ బాబును నియమించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దసరా ఉత్సవాల ముందు ఈ బదిలీ ప్రచారం ఆలయవర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈవో కోటేశ్వరమ్మను బదిలీ చేసేందుకు కొంతమంది దేవదాయ శాఖ మంత్రిపై ఒత్తిడి తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది.

08/20/2019 - 17:39

విజయవాడ: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని కరకట్ట ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముంపు ప్రాంతాల్లో సరైన సహాయక చర్యలు తీసుకోలేదని అన్నారు.

Pages