S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

08/20/2019 - 04:23

ఒంగోలు, ఆగస్టు 19: త్వరలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి బ్రాహ్మణ కార్పొరేషన్‌కు చైర్మన్‌ను నియమిస్తారని రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి వెల్లడించారు. సోమవారం అనంతపురం నుండి బాపట్లవెళ్తూ మార్గమధ్యంలో ఒంగోలులోని ఎన్‌ఎస్‌పి అతిథి గృహానికి చేరుకున్నారు. అనంతరం బ్రాహ్మణ సేవా సమితి కార్యవర్గసభ్యులు కొంతసేపు కోనతో మాట్లాడారు.

08/20/2019 - 04:01

విజయవాడ, ఆగస్టు 19: వరదలు, పోలవరం టెండర్ల రద్దు, అన్న క్యాంటీన్‌లు మూసివేత తదితర అంశాలపై గడచిన కొద్ది రోజులుగా విపక్ష నేతలు పెద్దస్థాయిలో ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి దూకుడు పెంచనున్నారు. అమెరికా పర్యటన ముగించుకుని వచ్చిన తరువాత ప్రజల్లోకి వెళ్లి దూకుడు పెంచేలా సలహాదారులు వ్యూహరచన కావిస్తున్నారు.

08/20/2019 - 04:01

విజయవాడ, ఆగస్టు 19: కృష్ణా జిల్లాల్లోని వరద ముంపు ప్రాంతాల్లో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మంగళవారం పర్యటించనున్నారు. ఇతర రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా కృష్ణా నదిపై ఉన్న రిజర్వాయర్లు నిండిపోయి భారీగా వరద నీరు రాష్ట్రంలోని రిజర్వాయర్లలోకి చేరింది. ప్రకాశం బ్యారేజీ నుంచి ఒక దశలో దాదాపు 8 లక్షల క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేశారు.

08/19/2019 - 13:33

విజయవాడ: నూతన మద్యం విధానం ఖరారైన నేపథ్యంలో ఏపీ ఎక్సైజ్ శాఖలో సమ్మెలు నిషేధించారు. ఈ నెల 24 నుంచి అమలులోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రైవేటు మద్యం దుకాణాల స్థానంలో రాష్ట్ర ప్రభుత్వ నేతృత్వంలో ఏపీ బేవరేజస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీఎస్‌బీసీఎల్‌) ఆధ్వర్యంలో దుకాణాలు రానున్న విషయం తెలిసిందే.

08/19/2019 - 06:29

విజయవాడ ఆగస్టు 18: సంకేతం, సందేశం, భావుకతల కలయికే ఫొటోగ్రఫీ రంగమని శాసన సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు.

08/19/2019 - 06:24

గుంటూరు, ఆగస్టు 18: గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో వరద సహాయక చర్యలకు తీవ్ర విఘాతం ఏర్పడింది. నాలుగు రోజులుగా చిరుజల్లులకే పరిమితమైన వర్షం ఆదివారం సాయంత్రం సమయంలో అకస్మాత్తుగా గంటన్నర సేపు ఏకధాటిగా కురవడంతో గుంటూరు నగరంలోని పలు రహదారులు, పల్లపు ప్రాంతాలు, జిల్లాలోని పలు ప్రాంతాలు తటాకాలను తలపించాయి.

08/19/2019 - 06:23

విజయవాడ ఆగస్టు 18: రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరోమారు చంద్రబాబు ఉంటే పరిస్థితి బాగుండేదని ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థవౌతోందని, వరదలొచ్చి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే సీఎం జగన్ విదేశాల్లో ఉల్లాసంగా తిరుగుతున్నారని శాసన మండలిలో టీడీపీ విప్ బుద్దా వెంకన్న ధ్వజమెత్తారు. నగరంలోని ఓ హోటల్‌లో ఆదివారం ఆయన విలేఖరులతో మాట్లాడారు.

08/19/2019 - 06:22

విజయవాడ, ఆగస్టు 18: రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించి మీ సేవ కేంద్రాల నిర్వహణ విషయమై స్పష్టమైన ప్రకటన చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గ్రామ సచివాలయాల నియామకాల్లో మీ సేవ సిబ్బందికి తగిన స్థానం కల్పించేందుకు చర్యలు చేపట్టాలని కోరుతూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ ఆదివారం ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు.

08/19/2019 - 06:22

గుంటూరు, ఆగస్టు 18: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాదినేని యామినీ శర్మ ఆ పార్టీని వీడి ఆదివారం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆదివారం గుంటూరులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో ఆమె పార్టీలో చేరారు. రాష్ట్ర అధికార ప్రతినిధిగా కొద్దికాలంలోనే వార్తల్లో నిలిచిన యామినీ శర్మ బీజేపీలో చేరడం తెలుగుదేశం పార్టీకి పెద్ద షాక్ ఇచ్చినట్లయింది.

08/19/2019 - 06:21

విజయవాడ, ఆగస్టు 18: నగరంలోని ప్రకాశం బ్యారేజీ వద్ద క్షణక్షణానికి కృష్ణానది వరద తీవ్రత గణనీయంగా తగ్గుతోంది. ఆదివారం రాత్రి 10గంటల సమయానికి 6లక్షల క్యూసెక్కుల నీరు నేరుగా సముద్రంలోకి వెళుతోంది. తూర్పు, పశ్చిమ డెల్టా కాలువలకు 18వేల క్యూసెక్కుల నీటిని వదలుతున్నారు. విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా కాలువలన్నీ నిండుకుండలా పారుతున్నాయి.

Pages