ఆంధ్రప్రదేశ్‌

ఉగాది కానుకగా శ్రీవారి లడ్డూలు ఉచితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బందికి ఉగాది కానుకగా ఈ నెల 25వ తేదీన శ్రీవారి లడ్డూలు ప్రతి కుటుంబానికి ఉచితంగా అందించాలని టీటీడీ నిర్ణయించింది. భక్తుల డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని దేవస్థానం నిత్యం లక్షల్లో లడ్డూలు తయారు చేసి నిల్వ ఉంచుతుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా ప్రభావం తీవ్రంగా ఉండడంతో శ్రీవారి దర్శనానికి భక్తుల రాకను నిన్న మధ్యాహ్నంతో నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే అంతకు ముందే దాదాపు రెండు లక్షల లడ్డూలను దేవస్థానం సిద్ధం చేసి ఉంచింది. తిరిగి ఆలయంలోకి భక్తుల ప్రవేశం ఎప్పుడన్నది కచ్చితంగా తెలియదు. ఈ పరిస్థితుల్లో ఉన్న నిల్వలను సిబ్బందికైనా పంచిపెడితే వారు సంతోషిస్తారని దేవస్థానం బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.