ఆంధ్రప్రదేశ్‌

నిరంతరం ఇంటర్నెట్ సేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: కరోనా వైరస్ నియంత్రణకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపడుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుమేరకు ఈ నెల 22న ‘జనతా కర్ఫ్యూ’ పాటిస్తున్నందున కీలకమైన ఇంటర్నెట్ సేవలకు అంతరాయం కలగకుండా తగిన ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా రాష్ట్ర ఐటీ, నైపుణ్యాభి వృద్ధి శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కోన శశిధర్‌తో శనివారం చర్చించారు. ఇంటి నుం చి విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులు, విద్యార్థులు, ఐటీ ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా 24గంటలూ ఇంటర్నెట్ సౌకర్యా న్ని అందించాలని మంత్రి ఆదేశించారు. ప్రభుత్వానికి వివిధ జిల్లాలు, ప్రాంతాల నుంచి సమాచారం వస్తుందని,
కరోనా పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉన్నందున నెట్ సదుపాయంలో అంతరాయం లేకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు, టెలికం సర్వీస్ ప్రొవైడర్లకు తగిన సూచనలిచ్చారు. సామాజిక దూరం పాటిస్తూనే కీలకమైన విధులు నిర్వహించే వారికి అంతరాయం కలుగకుండా వారి ప్లాన్‌కు అనుగుణంగా నెట్, టెలికం సేవలు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బందిని సిద్ధం చేసుకోవాలని, సాంకేతిక కారణాల వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. కోవిడ్-19 వైరస్ వ్యాప్తిచెందకుండా నియంత్రించటంలో ప్రజలు భాగస్వామ్యం వహించాలని కోరారు. జాతిని రక్షించేందుకు దేశ సరిహద్దుల్లో శత్రు దేశాలతో యుద్ధం చేసే జవాన్లతో సమానంగా కరోనాపై యుద్ధం చేసేవారంతా కూడా సమానులే అని అభిప్రాయపడ్డారు. అవగాహనతో నియమ, నిబంధనలకు అనగుణంగా ప్రత్యేకించి యువత కరోనా కట్టడికి నడుం బిగించాలని మంత్రి మేకపాటి పిలుపునిచ్చారు.