ఆంధ్రప్రదేశ్‌

వాయిదా కుట్రదారుల్ని వదిలేది లేదు: సజ్జల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మార్చి 19: స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా విషయంలో కుట్రదారులు ఎవ్వరినీ వదిలిపెట్టబోమని రాష్ట్రప్రభుత్వ ప్రజావ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హెచ్చరించారు. గురువారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వివాదాస్పద అంశాలతో కూడిన లేఖను ఎన్నికల కమిషనర్ రమేష్‌కుమార్ రాయకుంటే ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. పత్రికల్లో వచ్చిన లేఖను ఆయన రాసినట్లుగానే తాము భావిస్తున్నామన్నారు. ఈ లేఖ ప్రతులతో తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద కొందరు వ్యక్తులు, ఓ వర్గం ఎలక్ట్రానిక్ మీడియా హడావుడి చేశాయని తమకు సమాచారం ఉందన్నారు. రాష్ట్రంలో ఏమీ జరగకపోయినా ఏదో జరుగుతుందన్న భ్రమలను కల్పించారని, ఇలాంటి వ్యక్తి రాజ్యాగంబద్ధ పదవిలో ఉండటానికి అనర్హులన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేందుకు జరిగిన కుట్రగా లేఖ వివాదాన్ని తాము పరిగణిస్తున్నామన్నారు. ఆరోపణలు వచ్చి 18గంటలు దాటినా రమేష్‌కుమార్ ఈ లేఖపై ఇంకా స్పష్టత ఇవ్వలేదన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ను, ప్రభుత్వాన్ని నేరుగా ఎదుర్కొనే దమ్ము లేక చంద్రబాబు కుయుక్తులు పన్నుతున్నారన్నారు. ప్రధాన ప్రతినక్ష నేతగా ఎవరూ వాడని భాషను ఆయన ఉపయోగిస్తున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ ఖాళీ కావడంతో చంద్రబాబు అయోమయ పరిస్థితుల్లో ఉన్నారన్నారు. రాజ్యసభ ఎన్నికల్లో ఓడిపోతారని తెలిసి కూడా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వర్ల రామయ్యను చంద్రబాబు బరిలో దింపారన్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని, 1.34 కోట్ల కుటుంబాలను సర్వే చేసి 8,500 మంది విదేశాల నుండి వచ్చిన వారికి పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. దేశంలో ఎవరికీ లేని వలంటీర్ల వ్యవస్థ తమకు ఉందని, అందుకే ప్రభుత్వం చేసే ఏ పనైనా, పథకమైనా ప్రజలకు సకాలంలో చేరువ చేస్తున్నామని సజ్జల వివరించారు.