ఆంధ్రప్రదేశ్‌

విజయనగరంలో విదేశీయులకు కరోనా పరీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, మార్చి 19: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా విజయనగరం జిల్లాకు పాకిందని వదంతులు విన్పిస్తున్నాయి. నెదర్లాండ్స్‌కు చెందిన నలుగురు విదేశీయులు పట్టణానికి రావడంతో వారికి వైద్య పరీక్షలు జరిపి ఓ హొటల్‌లో ఉంచినట్టు సమాచారం. ఇదిలా ఉండగా, దక్షిణాఫ్రికా నుంచి చంద్ అనే మరోవ్యక్తి పట్టణానికి వచ్చారు. ఆయనకు కరోనా లక్షణాలు ఉండడంతో అతనికి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేసి ల్యాబ్‌కు పంపినట్టు జిల్లా కేంద్ర ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సీతారామరాజు తెలిపారు. కాగా, ఫ్లూ లక్షణాలు, కరోనా లక్షణాలు ఒకే మాదిరిగా ఉండటంతో ఏ వ్యాధి అన్నదీ వైద్య పరీక్షల్లో నిర్ధారణ కానుందని ఆయన చెప్పారు. ప్రభుత్వం కరోనాపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నప్పటికీ మరోపక్క కరోనా లక్షణాలు గల వ్యక్తులు నిర్లక్ష్యంగా ఉండటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల వల్ల వ్యాధిగ్రస్తులు మన రాష్ట్రంలో కూడా పెరుగుతున్నారు. నెల్లూరులో తొలి కరోనా కేసు నమోదు కాగా, ఆ తర్వాత కాకినాడ ఇతర జిల్లాల్లో కూడా ఈ కేసులు నమోదు అవుతుండటంతో అధికారులు హైరానా పడుతున్నారు. అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటించకపోవడంతో చిన్నారుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.