ఆంధ్రప్రదేశ్‌

సమరానికి సన్నద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మార్చి 21: కరోనా కట్టడికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మార్గదర్శకాలు జారీ చేశారు. దీం తో అధికార యంత్రాంగం కదం తొక్కింది. కొద్దిరోజులుగా అధికారులను అప్రమత్తం చేస్తున్న ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. కరోనా నివారణ చర్యలు ముమ్మరం చేసింది. ము ఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లాల్లో కంట్రోల్ రూములు,
టాస్క్ఫోర్స్ కమిటీలు ఏర్పాటయ్యాయి. శనివారం ఒక్కరోజే రాష్టవ్య్రాప్తంగా మంత్రులు, కలెక్టర్లు డివిజన్, మండల స్థాయి అధికారులతో వైరస్ నియంత్రణ చర్యలపై సమీ క్ష సమావేశాలు నిర్వహించారు. కరోనాను ఎదుర్కొనేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. రాష్ట్రం నుంచి గ్రామస్థాయి వరకు ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రతి ఇంటినీ సర్వే చేయటంతో పాటు కరోనా లక్షణాలున్న వారిని ఇళ్లలోనే ఐసోలేషన్‌లో ఉంచటం, అవసరమైతే ఆసుపత్రులకు తరలించాలని సూచనలిచ్చారు. విదేశాల నుంచి వచ్చినవారిపై పర్యవేక్షణ జరపాలన్నారు. నిత్యం వారి ఆరోగ్య వివరాలను సేకరించాలని వైద్యాధికారులు ఇచ్చే సూచనలు అమలు చేయాలని స్పష్టం చేశారు. దీంతోపాటు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఈ ప్రక్రియలో వలంటీర్లు, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. సచివాలయాల వ్యవస్థ సమర్థవంతంగా పనిచేయటం ద్వారా కరోనాపై తసమగ్ర సమాచారాన్ని సేకరించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. వ్యాధి లక్షణాలు ఉన్నవారిని గుర్తించేందుకు ఇంటింటా జల్లెడ పట్టాలని ఆదేశాలిచ్చింది. అనుమానిత కేసులుంటే వారికి వైద్య సూచనలు అందిస్తున్నారు. విశాఖలో కరోనా సోకిన వ్యక్తి కోలుకుంటున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అతను నివసిస్తున్న ఇంటికి 3కిలోమీటర్ల పరిధిలో పూర్తిస్థాయి సర్వే నిర్వహించారు. 335 బృందాలను రంగంలో దించి 25వేల 950 ఇళ్లల్లో సర్వే జరిపి కరోనా లక్షణాలు లేవని ప్రాథమికంగా నిర్థారించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. నెల్లూరులో పాజిటివ్‌గా చికిత్స పొందుతున్న వ్యక్తి కూడా కోలుకుని ఐసోలేషన్‌లోనే ఉన్నట్లు అధికారులు తెలిపారు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు జిల్లాల వారీ సమాచారాన్ని సేరించే పనిలో నిమగ్నమయ్యారు. గ్రామాల స్థాయి నుంచి కమాండ్ కంట్రోల్ రూముకు నిరంతరం సమాచారం అందుతోంది. జిల్లాల్లో కాల్‌సెంటర్లు ఏర్పాటుచేసి ప్రభుత్వ కార్యాలయాల వద్ద శానిటైజర్లు అందుబాటులోకి తెచ్చినట్లు అధికారులు వివరించారు. అవసరం ఉంటేనే కార్యాలయాలకు రావాలని, లేకపోతే ఇళ్లలో పరిశుభ్రత పాటించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటివరకు విదేశాల నుంచి వచ్చిన వారిలో కొద్దిమందినే అనుమానితులుగా గుర్తించామని ప్రకటించింది. పాజిటివ్ కేసులు మూడు మాత్రమే నమోదయ్యాయని వివరించింది.

*చిత్రం... ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి