ఆంధ్రప్రదేశ్‌

కుప్పం వైథ్య కళాశాలలో కరోనా కలకలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుప్పం, మార్చి 19: కుప్పం పీఈఎస్ వైద్య కళాశాలలో కరోనా రోగిగ్రస్తుడు ఉన్నాడన్న విషయం బయటకు పొక్కడంతో కలకలం చెలరేగింది. తమిళనాడు రాష్ట్రం వానియంబాడి పట్టణానికి చెందిన కరీముల్లా (80) తీవ్ర జ్వరంతో వానియంబాడిలోని ఒక ప్రెవేటు ఆసుపత్రిలో చికిత్స కోసం చేరాడు. జ్వరం తీవ్రత తగ్గకపోవడంతో మెరుగైన వైద్యంకోసం కుప్పం పీఈఎస్ వైద్య కళాశాలకు తరలించి వైద్యం అందిస్తున్నారు. ఈనెల 10వ తేదీన కరీముల్లా కుమారుడు దారియా దుబాయి నుంచి వానియంబాడికి వచ్చాడు. కొన్ని రోజులకే తండ్రి కరీముల్లాకు తీవ్ర జ్వరం రావడంతో కుటుంబ సభ్యులు బెంబేలెత్తి సమీపంలోని వైద్యశాలకు తరలించి ప్రాథమిక చికిత్స చేయించారు. అయితే జ్వరం ఎంతకీ తగ్గకపోవడంతో మెరుగైన చికిత్స నిమిత్తం కుప్పం పీఈఎస్ వైద్యశాలకు తరలించి వైద్యం చేయిస్తున్నారు. ఈ క్రమంలో కరీముల్లాకు కరోనా వ్యాధి సోకిందని పుకార్లు రావడంతో కుప్పం పట్టణవాసులు భయందోళనలకు గురవుతున్నారు. కరీముల్లాకు చికిత్స చేస్తున్న పీఈఎస్ వైద్యులు ఆయనకు కరోనా వ్యాధి ఉండవచ్చనే అనుమానంతో గురువారం తిరుపతి రుయా వైద్యశాలకు రెఫర్ చేశారు. ఈ విషయం దావానలంలా వ్యాపించడంతో పీఈఎస్ ఆసుపత్రిలోని రోగులంతా డిశ్చార్జ్ చేయించుకుని వెళ్లిపోతున్నారు. ప్రపంచాన్ని గడగడ లాడిస్తున్న కరోనా వైరస్ కుప్పం పట్టణంలో ఉందని ప్రచారంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.