ఆంధ్రప్రదేశ్‌

కోవిడ్-19 నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 19: ప్రపంచ వ్యాప్తంగా భయపెడుతున్న కోవిడ్-19 (కరోనా)కు సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశిస్తూ జిల్లా పంచాయతీ అధికారులు కార్యనిర్వహణ అధికారులతో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ పీ గిరిజాశంకర్ గురువారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. మందులు లేని రోగాల వ్యాప్తి సమూహాలకు దూరంగా ఉన్నప్పుడే నివారించగలమని, వ్యాధి సోకిన వారికి దూరంగా ఉండటం ద్వారానే వీటిని నివారించ గలుగుతామని, సామాజిక దూరాన్ని పాటించడం ద్వారా వ్యాప్తి వేగాన్ని తగ్గించగలుగుతామన్నారు. విద్యా సంస్థలు, సాంస్కృతిక సామాజిక కేంద్రాలు, సినిమా హాళ్లు, తదితర జన సమ్మర్థముండే వాటినన్నింటినీ మూసివేయాలన్నారు. విద్యార్థులు ఇంటివద్దనే ఉండాలని, ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులు ఇంటి నుంచే పనిచేసేలా ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాలని కమిషనర్ కోరారు.